/rtv/media/media_files/2025/01/12/EK8ihQk0H6UiqcCX12Dp.jpg)
shahbaz sharif
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 2.2 కోట్ల మందికి పైగా పిల్లలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాల బాలికల విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలిపారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న షరీఫ్ బాలకల విద్య గురించి మాట్లాడారు. '' రాబోయే పదేళ్లలో లక్షలాది మంది యువతులు ఉద్యోగాలు చేపట్టనున్నారు. వీళ్లందరూ పేదరికం నుంచి తమ కుటుంబాలను బయటకు తీసుకొస్తారు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడతారు.
Also Read: రేపటి నుంచి మహాకుంభమేళ ఉత్సవాలు.. మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి? శుభ సమయం ఏంటి?
పాకిస్థాన్ జనాభాలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. వాళ్ల అక్షరాస్యత రేటు మాత్రం 49 శాతమే. 5 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 2.2 కోట్ల మందికి పైగా పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. బాలికకు విద్య అందించకపోడవం, వాళ్లని అడ్డుకోవడమనేది వారి హక్కులను హరించడమేనని'' షెహబాద్ షరీఫ్ అన్నారు.
Also Read: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్‌లు.. లిస్ట్ ఇదే!
ఇదిలాఉండగా.. రెండ్రోజుల పాటు జరిగనున్న ఈ సదస్సుకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ హాజరుకానున్నారు. అలాగే ముస్లిం మెజార్టీ దేశాల నుంచి పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బాలికల విద్యపై సదస్సులో పాల్గొనేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు యూసఫ్‌జాయ్ ఎక్స్‌లో తెలిపారు.
Also Read: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?
Also Read: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన!