/rtv/media/media_files/2025/02/14/fPnwvJAB4S43jTxuWWAS.jpg)
Pakistani people banned in 12 countries
Pakistanis Deported: పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాలు బిగ్ షాక్ ఇస్తున్నాయి. పాక్‌లో పెరుగుతున్న ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, నేరాలు, అక్రమ ప్రవేశాలు ఇతర కారణాల వల్ల పలు దేశాలు పాక్ ప్రజలు తమ దేశానికి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గత 48 గంటల్లో 12 దేశాలు ఒకేసారి 131 మంది పాకిస్తానీలను తమ దేశం నుంచి బహిష్కరిస్తూ వెనక్కు పంపించాయి(Pakistani people banned in 12 countries). ఇందులో ముస్లీం దేశమైన సౌదీ అరేబియా(Saudi Arabia) కూడా ఉండటం గమనార్హం.
యూఏఈ, సౌదీ అరేబియా..
పాకిస్థాన్ కు చెందిన పలువురు వివిధ నేరాలు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు 12 దేశాలు చెబుతున్నాయి. అంతేకాదు తమ దేశాల్లోకి అక్రమ ప్రవేశం, ముందస్తు నోటీసు లేకుండా ఉద్యోగం నుండి నిష్క్రమించడం వంటి కారణాలున్నట్లు ఆయా దేశాల అధికారులు వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), సౌదీ అరేబియా.. ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం 74 మంది పాకిస్తానీయులను బహిష్కరించింది. ఇకపై అడ్డదారిలో యుఏఈ లోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. వారందరినీ పాకిస్తాన్‌కు తిరిగి పంపిస్తున్న తరుణంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అతన్ని లైఫ్ టైమ్ బ్యాన్ చేశారు.
ఇది కూడా చదవండి: బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడి
ఇతర దేశాల నుండి బహిష్కరణ..
ఒమన్, కంబోడియా, బహ్రెయిన్, అజర్‌బైజాన్, ఇరాక్, మెక్సికో నుండి కూడా పాకిస్తానీయులను బహిష్కరించారు. ఈ దేశాలలో మాదకద్రవ్యాలు, అక్రమ వలస కేసులు నమోదయ్యాయి. మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను మౌరిటానియా, సెనెగల్ నుండి బహిష్కరించారు. బహిష్కరించబడిన వారిలో 16 మందిని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్‌కు అప్పగించగా ఆరుగురిని లర్కానా, కలత్, గుజ్రాన్‌వాలా, సాహివాల్, రావల్పిండి పోలీసులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Thalapathy Vijay Y+ Security: తమిళ్ హీరో విజయ్ దళపతికి Y+ కేటగిరి సెక్యురీటి
కరాచీ విమానాశ్రయంలో 86 మంది..
కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు వివిధ కారణాల వల్ల 86 మంది ప్రయాణికులకు బోర్డింగ్ కు నిరాకరించారు. వీరిలో 30 మంది ఉమ్రా యాత్రికులు ఉన్నారు. వీరికి హోటల్ బుకింగ్, ప్రయాణ ఖర్చులకు తగినంత డబ్బు లేకపోవడం వల్ల నిలిపివేశారు. సైప్రస్, బ్రిటన్, అజర్‌బైజాన్, కిర్గిజ్‌స్థాన్‌లకు ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులను కూడా సరైన పత్రాలు లేనందున డీబోర్డ్‌కు తరలించారు. దీనితో పాటు సౌదీ అరేబియా, ఒమన్, అజర్‌బైజాన్, మలావి, కాంగో, బహ్రెయిన్, మలేషియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, టర్కీ, జింబాబ్వే నుంచి పర్యాటక వీసాపై ప్రయాణించే ప్రయాణికులను కూడా నిలిపివేశారు.
ఇది కూడా చదవండి: Delhi CM: ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం జరిగేది అప్పుడే !
పాకిస్తాన్ పౌరులకు హెచ్చరిక..
ఈ బహిష్కరణల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులకు వివిధ దేశాలు వార్నింగ్ ఇస్తున్నాయి. మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, అక్రమ ప్రవేశం, ఇతర తీవ్రమైన నేరాలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేస్తున్నాయి. ఇది కాకుండా అవసరమైన పత్రాలు లేదా సరైన సన్నాహాలు లేకుండా ప్రయాణించే పౌరులు కూడా భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని ముందస్తు హెచ్చరిక జారీచేశాయి.