Imran Khan: చనిపోయే వరకు ఇక్కడే ఉంటా.. ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన ప్రకటన

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పాకిస్థాన్‌ విడిచివెళ్లిపోయే ఛాన్స్ వచ్చినా కూడా ఇందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Imran Khan

Imran Khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పాకిస్థాన్‌ విడిచివెళ్లిపోయే ఛాన్స్ వచ్చినా కూడా ఇందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. '' నేను అటోల్ జైల్లో ఉన్నరోజుల్లో మూడేళ్ల వరకు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ఛాన్స్ వచ్చింది. కానీ ఇందుకు నేను ఒప్పుకోలేదు. నేనిక్కడే ఉంటాను. ఇక్కడే మరణిస్తాను. ఎప్పుడూ కూడా నా మాట ఒక్కటే. పోలీసులు అదుపులోకి తీసుకున్న మా పార్టీ నేతలు, కార్యకర్తలను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలి. నా వ్యక్తిగత పరిస్థితి గురించి చర్చించడం ఆలోచిస్తాను. పాకిస్థాన్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా స్వదేశంలోనే తీసుకోవాలనేది నా అభిప్రాయమని'' ఇమ్రాన్‌ ఖాన్ అన్నారు.  

Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్!

అలాగే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై కూడా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అందాల్సిన హక్కులు అణిచివేతకు గురైనప్పుడు అంతర్జాతీయంగా ఉన్న గళాలు బలంగా వినిపిస్తాయని అన్నారు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ఉంది కూడా అందుకే కదా అని అన్నారు. ముషారఫ్ పాలనలో మిలటరీ జోక్యం ఉందని విమర్శలు వచ్చినా కూడా ఈ స్థాయిలో అణిచివేత లేదని ధ్వజమెత్తారు.

 

Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?

ఇదిలాఉండగా.. ఇమ్రాన్ ఖాన్‌పై దాదాపు 200 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తోషఖానా, సైఫర్ లాంటి తదితరల కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది నుంచి జైల్లోనే ఉంటున్నారు. అయితే ఇటీవల పీటీఐ (పాకిస్థాన్ తెహ్రాక్-ఈ-ఇన్సాఫ్)  పార్టీ శ్రేణులు.. ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని పెద్దఎత్తున నిరసనలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇమ్రాన్‌ ఖాన్‌ నుంచి సంచలన పోస్ట్‌ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment