/rtv/media/media_files/2025/03/11/zg8pczUlmB35FDVhNKDl.jpg)
Baloch Liberation Army Hijack Jaffar Express Train In Pakistan
పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా ఓ రైలునే హైజాక్ చేశారు. మంగళవారం బలుచిస్తాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను తీవ్రవాదులు హైజాక్ చేశారు. ఇది తామే చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. దాదాపు 500 మందికి పైగా ప్రయాణికులను తీవ్రవాదులు ట్రైన్‌లో నిర్బంధించడం కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌లోని బలొచిస్థాన్ ప్రావిన్స్ నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ వరకు వెళ్తున్న జాఫర్ రైలులో మంగళవారం ఈ హైజాక్ ఘటన జరిగింది.
80మందిని విడిపించిన పాక్..
ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం హైజాక్ అయిన ప్రజలను కాపాడే పనిలో పడింది. ఇందులో భాగంగా పాక్ ఆర్మీ 104మందిని విడిపించింది. ఇందులో 43 మంది పరుషులు, 26మంది మహిళలు, 11మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఉగ్రవాదుల అదుపులో ఇంకా 100మందికి పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 104 మందిని రక్షించే క్రమంలో 16 మంది మిలిటెంట్లు చనిపోయారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Also Read: Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్!
బలోచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు జాఫర్ ఎక్స్‌ప్రెస్ కు వెళుతున్న రైలుపై బలోన్ ప్రాంతం దగ్గర కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. రైల్వే ట్రాకులను పేల్చి ట్రైన్ ను తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రైల్లో ఉన్న వారందరినీ మిలిటెంట్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే వెంటనే పాక్ సైనికులకు, మిలిటెంట్లకు కాల్పులు జరిగి కొంతమందిని కాపాడారు. ఆ కాల్పుల్లో 30మంది పాక్ సైన్యాన్ని చంపినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే తమ దగ్గర బందీలుగా ఉన్నవారందరినీ చంపుతామని బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే.. బలోచ్ రాజకీయ నేరస్థులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం 48 గంటల గడువు ఇచ్చింది.