Musk-Pakisthan: మస్క్‌ క్షమాపణలు చెప్పాల్సిందే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
Elon musk

Elon Musk: ప్రపంచ కుబేరుల్లో అత్యంత ధనవంతుడు అయినటు వంటి ...టెస్లా, స్పేస్‌ఎక్స్‌, ట్విటర్‌ సంస్థల అధినేత మస్క్‌ అంటే ఇప్పుడు పాకిస్తాన్‌ మండిపడుతుంది. మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీ.. పాకిస్తాన్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు మొదలుపెట్టాలని భావిస్తుండగా.. అందుకోసం పాక్ ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు. అయితే పాక్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ప్రారంభించాలంటే.. తమ దేశంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పట్టుబట్టుకుని కూర్చుంది.

Also Read: Indian Voters: భారత్‌ సంచలనం.. 99.1 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య

అయితే ఎలాన్ మస్క్.. ఇటీవల పాకిస్తాన్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు పాక్ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఎలాన్ మస్క్ సారీ చెప్పాల్సిందేనని గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. మస్క్‌ మాటలతో అంతర్జాతీయంగా పాక్‌ పరువు పోయింది. దీంతో క్షమాపణలు చెప్పాలని అడుగుతుంది. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌కు చెందిన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విభాగం స్టార్‌లింక్‌.. ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పాకిస్తాన్‌లో అప్లై చేసుకుంది. 

అయితే ఈ విషయాన్ని పాక్ అధికారులు పరిశీలిస్తుండగా.. దీనిపై ఐటీ, టెలికమ్యూనికేషన్‌కు సంబంధించిన సెనెట్‌ కమిటీ, అధికారుల మధ్య చర్చ జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కమిటీ ఛైర్మన్ పల్వాషా మహమ్మద్‌ ఖాన్‌.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను చట్టసభ్యులు ఖండించారని.. అందుకు మస్క్ క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. అయితే ఇది కండిషన్ అని తాము చెప్పడం లేదని పేర్కొన్న పల్వాషా.. చర్చల్లో ఇది ఒక భాగంగా ఉండాలని.. దీనిపై ప్రభుత్వానికి తాము సిఫారసు చేస్తామని పేర్కొంది.

Also Read: Mumbai Cricket Association: ముంబయి క్రికెట్ అసోసియేషన్ గిన్నిస్ రికార్డు!

బ్రిటన్‌లో గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ గ్యాంగ్స్ వెనుక బ్రిటిష్‌ పాకిస్తానీల హస్తం ఉందని ఆరోపణలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి  మస్క్‌ ఒక పోస్ట్ పెట్టారు. 2008-2013 మధ్య పాకిస్తాన్‌ వ్యక్తి ఓల్డ్‌ హోమ్‌లో లైంగిక వేధింపుల గ్యాంగ్‌లను నిర్వహించినా.. ఆ సమయంలో క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ హెడ్‌గా ఉన్న ప్రస్తుత బ్రిటన్ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే ఆ గ్రూప్‌ను ఆసియా గ్రూమింగ్ గ్యాంగ్ అంటూ పేర్కొనడాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఖండిస్తూ.. వాటిని పాకిస్తాన్‌ గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌ అని పిలవాలని సూచించారు. అయితే ఆ పోస్ట్ నిజమే అంటూ ప్రియాంక చతుర్వేది పోస్ట్‌కు మస్క్‌ బదులివ్వడం పాక్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని సమాచారం.

 గ్రూమింగ్ గ్యాంగ్‌ అంటే ఏమిటి!

పిల్లలు, కౌమారదశలో ఉన్న వారితో రిలేషన్ పెట్టుకోవడం, వారి ఎమోషన్స్‌తో ఉపయోగించుకోవడం, వేధింపులకు పాల్పడటాన్ని గ్రూమింగ్‌ అంటారు. మరీ ముఖ్యంగా పిల్లలు, యవ్వన దశలో ఉన్న వారిని లైంగిక అవసరాలు తీర్చుకోవడానికి లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు, మానవ అక్రమ రవాణా చేయడానికి ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుంటారు. అయితే ఇదంతా ఒక గ్యాంగ్‌ లాగా ఉండటంతో వాటిని గ్రూమింగ్ గ్యాంగ్‌లు అని అంటారు.

Also Read: Greenpeace: దావోస్‌లో సంపన్నుల ప్రైవేటు జెట్‌లు స్వాధీనం.. పర్యావరణ ప్రేమికుల వినూత్న నిరసన

Also Read:  Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!

పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

New Update
పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

పైకి బీరాలు పోతున్నా పాకిస్తాన్ లోపల భయపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. పాక్ పీవోకేలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఒకవైపు బోర్డర్ లో భారత్ చర్యలు, యుద్ధం తప్పదన్న హెచ్చరికలతో పాకిస్తాన్ అత్యవసర నిర్ణయాలను తీసుకుంటోంది. పాక్ పీవోకేలో అత్యవసర ఆంక్షులు విధించింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాటూ ఆరోగ్య కార్యకర్తల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25న జీలం వ్యాలీ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రులు, ఆరోగ్య విభాగాలలోని వైద్య సిబ్బందిని వారి వారి డ్యూటీ పాయింట్ల వద్దనే ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవు మీద ఉన్నవారు కూడా వెంటనే డ్యూటీల్లో జాయిన్ అవ్వాలని చెప్పింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 

అప్రమత్తమైన భారత బలగాలు..

పాక్ హెల్త్ డైరెక్టరీ ఉత్తర్వులను భారత భద్రతా సంస్థలు కూడా తీవ్రంగా పరిగణించాయి. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఎల్వోసీ దగ్గర సైనిక లేదా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్, పరిసర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా జరగొచ్చని ఊహిస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు పహల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో పెట్రోలింగ్, నిఘాను ముమ్మరం చేశాయి.  ఇక నియంత్రణ రేఖ దగ్గర భారత సైన్యం ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. భారత సైన్యం ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | pakistan | loc | emergency 

Also Read:   J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

Advertisment
Advertisment
Advertisment