/rtv/media/media_files/2026/04/25/norway-plans-social-media-ban-for-children-below-16-2026-04-25-09-26-38.jpg)
Norway plans social media ban for children below 16
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇండోనేషియా కూడా ఈ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ దేశాల జాబితాలో తాజాగా నార్వే కూడా చేరనుంది. ఈ ఏడాది చివరి నాటికి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. నార్వే ప్రధాని జొనాస్ దీనికి సంబంధించి ఈ ప్రకటన చేశారు. పిల్లలు ఆటలు, స్నేహాన్ని, రోజువారీ జీవితాన్ని అల్గారిథమ్‌లు, స్క్రీన్లు లాగేసుకోవజద్దు.
Also Read: ఆ దేశంలో విచ్చలవిడిగా సె*క్స్.. ప్రతి నలుగురిలో ఒకరికి HIV..
పిల్లలు పిల్లల్లాగే వాళ్ల బాల్యాన్ని గడపాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నాం. వారి జీవితాలను రక్షించేందుకు ఇదొక కీలక చర్యగా భావిస్తున్నామని'' జొనాస్ తెలిపారు. అయితే ఏయే సోషల్ మీడియా వేదికలపై నిషేధం ఉంటుందనే దానిపై ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయలేదు.
Also Read: 50 అణు రియాక్టర్లు నిర్మిస్తాం.. చైనా సంచలన ప్రకటన
ఇదిలాఉండగా ఫ్రాన్స్ కూడా తమ దేశంలో 15 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి చేసే చట్టాలను తీసుకొచ్చింది. ఇక బ్రిటన్‌లో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలా లేదా అనే దానిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు అమెరికాలోని ఫ్లోరిడా లాంటి రాష్ట్రాలు 14 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టాలు చేశాయి. వీటిని సవాలు చేస్తూ పలువురు పిటిషన్లు వేయడంతో కోర్టుల్లో దీనిపై వివాదాలు నడుస్తున్నాయి. గ్రీస్ కూడా 2027 నుంచి 15 ఏళ్లు పిల్లలకు నిషేధం విధించనున్నట్లు ప్రకటన చేసింది.
Follow Us