/rtv/media/media_files/2025/03/27/CC3j41x5uXmh08R3zrD7.jpg)
North Korea has sent 3,000 more soldiers to bolster Russia’s war on Ukraine
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యా తరఫున ఉత్తర కొరియా సాయం చేస్తోంది. తాజాగా తమ దేశానికి చెందిన మరో 30 వేల మంది సైనికులను పంపించింది. దక్షిణ కొరియా సైన్యం గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. అలాగే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆండ్రీ రూడెంకో అన్నారు.
Also Read: ప్రేమిస్తావా.. ఫోన్ నంబర్, ఫొటోలు బయటపెట్టమంటావా- 9th క్లాస్ బాలుడి అరాచకం!
ఇదిలాఉండగా.. రష్యా తరఫున పొరాడేందుకు కిమ్ ప్రభుత్వం ఇప్పటికే 11 వేల మంది సైనికులను పంపించింది. వీళ్లలో సుమారు 4 వేల మంది మరణించడమే లేదా గాయాలపాలవ్వడమో జరిగినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. కేవలం సైన్యం మాత్రమే కాదు. చాలావరకు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా రష్యాకు తరలించారు. అలాగే రష్యా అత్యాధునిక స్పేస్, శాటిలైట్ సాంకేతికతను ఉత్తర కొరియాతో కూడా పంచుకోనుందని అమెరికా వర్గాలు ఇప్పటికే చెప్పాయి.
Also Read: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు
అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో గురువారం ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించినట్లు అక్కడి ప్రభుత్వం మీడియా తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇవి పనిచేస్తాయని చెప్పింది. అంతేకాదు తమ సైన్యం డ్రోన్ల సామర్థ్యాన్ని కిమ్ తనిఖీ చేసినట్లు తెలిపాయి. తమ దేశ అత్యాధునిక డ్రోన్లు శత్రువుపై నిఘా ఉంచడంతో పాటు భూమి, సముద్రంపై కూడా దాడులు చేయగలవని పేర్కొంది. అయితే ఉత్తర కొరియా ఎయిర్‌బార్న్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌ను సైతం తయారుచేసింది. ఆ దేశ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేసింది. రష్యాకు చెందిన ఐఎల్ 76 విమానాన్ని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌కు అమర్చేందుకు వాడినట్లు నిపుణులు చెబుతున్నారు.
ukraine | russia-ukraine-war | telugu-news | rtv-news | north-korea