BIG BREAKING: అమెరికా వెళ్లాలనుకునేవారికి బిగ్ షాక్.. H1 బీ వీసా మూడేళ్లు రద్దు !

అమెరికాలో హెచ్‌1 బీ వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీ ఎలీ క్రీన్ ''ఎండ్ హెచ్‌1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026'' బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లు గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

New Update
New US bill wants to pause H-1B visas for 3 years, What else does it propose?

New US bill wants to pause H-1B visas for 3 years, What else does it propose?

అమెరికాలో హెచ్‌1 బీ వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీ ఎలీ క్రీన్ ''ఎండ్ హెచ్‌1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026'' బిల్లును ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లు ప్రవాస భారతీయుల్లో ఆందోళన రేపుతోంది. హెచ్‌ 1బీ వీసాకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ తీసుకొచ్చిన బిల్లు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇంతకి ఈ బిల్లులో ఏముందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

మూడేళ్ల విరామం

ఈ బిల్లు ప్రకారం హెచ్‌1బీ ప్రోగ్రామ్‌ను ప్రారంభంలో మూడేళ్ల పాటు పూర్తిగా నిలిపివేస్తారు. అనంతరం దీన్ని పునరుద్ధరిస్తారు. ప్రస్తుతం ఉన్న 65 వేల వార్షిక వీసాల కోటాను కేవలం 25 వేలకే తగ్గించేస్తారు. అంతేకాక ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి లాటరీ విధానాన్ని రద్దు చేస్తారు. అత్యధిక వేతనం పొందే వాళ్లకి ప్రాధాన్యత ఇచ్చే 'వేజ్‌బేస్డ్‌' ఎంపిక పద్ధతిని ప్రవేశపెడతారు. 

విదేశీ కార్మికులను తక్కువ వేతనాలకే నియమించుకుంటున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ప్రకారం హెచ్‌1బీ ఉద్యోగులకు కనీసం  $200,000 (సుమారు రూ.1.67 కోట్లు) వార్షిక వేతనం చెల్లించాలి. దీంతో మధ్యస్థాయి ఐటీ నిపుణులకు అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే థర్డ్‌పార్టీ సంస్థల ద్వారా ఉద్యోగాలను నిషేధిస్తారు. ఇక హెచ్‌1బీ హోల్డర్లు తమ కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకురావడాన్ని సైతం తీసుకురావడాన్ని ఈ బిల్లు అడ్డుకుంటుంది.

Also Read: బీజేపీలో చేరిక.. RTVకి మల్లారెడ్డి కోడలు సంచలన ఇంటర్వ్యూ!

 అంతర్జాతీయ విద్యార్థులకు కీలకంగా ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానాన్ని కూడా ఈ బిల్లు ప్రకారం రద్దు చేస్తారు. మరీ ముఖ్యంగా H1బీ వీసాపై ఉన్నవాళ్లు శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డు) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఒక వీసా నుంచి మరో వీసాకు మారాలన్నా అభ్యర్థులు అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కేవలం ఎలీ క్రేన్ మాత్రమే కాక.. అండీ ఓగ్లెస్, గ్రెగ్ స్టూబ్ లాంటి ఇతర ఎంపీలు సైతం హెచ్-1బీని పూర్తిగా రద్దు చేయాలని లేదా సున్నాకు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

H1బీ వీసాల్లో సుమారు 70 శాతానికి పైగా భారతీయులకే వస్తున్నాయి. ప్రస్తుతం 2.83 లక్షల మంది భారతీయులు ఈ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారు. అమెరికా, గూగుల్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు కూడా భారతీయ నిపుణులపైనే ఆధారపడుతున్నాయి. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారిపోతే లక్షలాది మంది భారతీయులకు అమెరికా వెళ్లాలనే కల చెదిరిపోతుంది. అలాగే దీనివల్ల ఐటీ రంగంలో అనేక మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 

Also Read: ఒక చిన్న దేశం నుండి సైనిక శిక్షణ పొందుతున్న అమెరికాసైనికులు...ఒకపుడు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా...

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక H1 బీ వీసా జారీలు సుమారు 25 శాతం వరకు తగ్గాయి. అమెరికన్లకే అక్కడి ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ వీసా ఫీజును $100,000 డాలర్లకు (దాదాపు రూ.84 లక్షలు) పెంచేశారు. అలాగే దరఖాస్తుదారుల ఆన్‌లైన్ ప్రొఫైల్స్, సోషల్ మీడియా అకౌంట్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. 2025 చివరిలో జరగాల్సిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లను ఏకంగా 2027కి వాయిదా వేశారు.

Advertisment
తాజా కథనాలు