/rtv/media/media_files/2025/03/06/rbfOEslJ3vsE4k83wKVr.jpg)
New Trump travel ban could bar Afghans, Pakistanis soon
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విదేశాలపై సుంకాల పెంపు, ఉద్యోగాల కోత వంటి సంచలన నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతేకాదు పలు దేశాల నుంచి వాళ్లపై కూడా నిషేధం విధించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లపై ట్రావెల్ బ్యాన్ విధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల వల్ల అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వచ్చే వారమే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!
ట్రంప్ 2016లో మొదటిసారిగా అధ్యక్షుడు అయిన సమయంలో కూడా పలు ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడకుండా బ్యాన్ చేశారు. 2018లో అక్కడి సుప్రీంకోర్టు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగానే అమెరికాకి వచ్చే విదేశీయుల నుంచి జాతీయ భద్రతా ముప్పు ఉందా అనే విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వహక ఆదేశంపై కూడా సంతకం పెట్టారు.
అయితే పూర్తిగానా లేదా పాక్షికంగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను రూపొందిచాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. మార్చి 12 లోగా ఈ నివేదికను సమర్పించాలని కోరారు. పూర్తిగా నిషేధం కోసం సిఫార్సు చేసిన జాబితాలో అఫ్గానిస్థాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులోనే పాకిస్థాన్‌ను కుడా చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు
అఫ్గానిస్థాన్‌లో దాదాపు 20 ఏళ్ల పాటు ఉన్న అమెరికా సైన్యం ఉన్న సంగతి తెలిసిందే. వాళ్ల కోసం పనిచేసిన అఫ్గాన్ స్థానికులపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకోనున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే అఫ్గాన్ పౌరుల్లో వేలాది మంది అమెరికాలో శరణార్థులు లేదా ప్రత్యేక వలసవాదుల కింద వీసా పొందారు. ఒకవేళ ఈ నిషేధం అమల్లోకి వస్తే.. వీళ్లందరిపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.