/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)
Elon Musk
Elon Musk: ఐదు నెలల క్రితం తానొక బిడ్డకు జన్మనిచ్చానని..ఆ బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని చెప్పుకొచ్చారు అమెరికా రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్(Ashley St. Clair). తామిద్దరం దీనిని గోప్యంగా ఉంచాలనుకున్నామని...కొన్ని మీడియా సంస్థలు దానిని బహిర్గతం చేశామని ఆమె తెలిపారు. అందుకే ఇప్పుడు తానే స్వయంగా తన బిడ్డ గురించి చెప్పడానికి ముందు వచ్చానని చెప్పారు. మా సంతానం సురక్షిత వాతావరణంలో పెరగాలని కోరుకుంటున్నానని..మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దని ఆష్లీ కోరారు. అయితే దీనిపై ఎలాస్ మస్క్ ఇప్పటి వరకు స్పందించలేదు.
Also Read : USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్
మొత్తం 13 మంది..
మరోవైపు టెస్లా అధినేత మస్క్ కు 12 మంది సంతానం ఉన్నారు. మొదటి భార్య జస్టిన్‌కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తరువాత 2008లో వారిద్దరూ విడిపోయారు. దీని తరువాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ పెళ్ళి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. వీరిద్దరూ కలిసి ఉన్నారో లేదో తెలియదు. కానీ ఎలాన్ ప్రస్తుతం కెనెడియన్ గాయని గ్రిమ్స్ తో కలిసి ఉంటున్నారు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరందరూ కాక రీసెంట్ గా తనకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు మస్క్ తానే స్వయంగా ప్రకటించారు. తన ప్రతిష్ఠాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్‌లో పనిచేస్తోన్న ఎగ్జిక్యూటివ్‌తోనూ మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పారు. దీంతో ఆయన పిల్లల సంఖ్య 12 కు చేరుకుంది. ఇప్పుడు ఆష్లీకి పుట్టిన బిడ్డతో కలిపి ఎలాన్ కు 13 మంది పిల్లలు ఉన్నట్లు అయింది.
ఇక ఎలాన్ మస్క్, ఆయన మొదటి భార్య జస్టిన్ కు పుట్టిన జేవియర్ అలెగ్జాండర్ కొంత కాలం క్రితం అమ్మాయిగా మారారు. తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవియర్ ప్రకటించారు. ఈ కోపంతోనే ఎలాన్ మస్క్...మొత్తం అమెరికాలోనే ట్రాన్స్ జెండర్స్ కు హక్కులు లేకుండా చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ మీద వత్తిడి తీసుకువచ్చారని వార్తలు వచ్చాయి. ట్రంప్ ట్రాన్స్ జెండర్ ఫైల్ మీద సంతకం చేయడానికి ఇది కూడా ఒక రీజన్ అని అన్నారు.
Also Read: USA: హెచ్ 1 బీ వీసాదారులకు షాక్..డ్రాప్ బాక్స్ రూల్స్ కఠినతరం