/rtv/media/media_files/2025/03/19/bEftx8OE97Y3BBQL0JrG.jpg)
tesla
అమెరికాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో కార్లకు కొందరు దుండగులు నిప్పంటించారు.అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటుచేసిన డోజ్ శాఖకు టెస్లా అధినేత మస్క్ సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈశాఖ సలహాలతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అగ్రరాజ్యంలో మస్క్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Also Read: America: అమెరికా శాస్త్రవేత్తలు, పరిశోధకులను వెంటాడుతున్న తొలగింపు భయం
ఈ క్రమంలోనే టెస్లాకు వ్యతిరేకంగా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.లాస్ వెగాస్ లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. అనంతరం ఒక కారు పై అభ్యంతరకర పదజాలంతో స్పే పెయింట్ వేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకుని వచ్చారు.
Also Read: Yadagiri Gutta: ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!
Musk Describes Burning Of Tesla Cars
దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని షోరూం అధికారులు తెలిపారు.ఇక కాన్సాస్ సిటీలో రెండు టెస్లా సైబర్ ట్రక్కులను దుండగులు తగలబెట్టారు.దక్షిణ కరోలినాలో ఒక వ్యక్తి టెస్లా ఛార్జింగ్ స్టేషన్ కు నిప్పటించే ప్రయత్నం చేశాడు.ఇటీవల సైతం ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇక వరుస ఘటన పై స్పందించిన మస్క్..ఇది ఒక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
ఈ స్థాయి హింస,వెర్రి..చాల పెద్ద తప్పు.టెస్లా కేవలం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. ఈ ఘటన లపై స్థానిక పోలీసులు,ఎఫ్‌బీఐ ,ఇతర విభాగాలతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ వ్యయాల కట్టడి చేయడం కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీని ఏర్పాటు చేశారు.దీని పగ్గాలను మ్క్‌కు అప్పగించారు.
ఈ శాఖ ఇచ్చిన సలహాలతో వేల మంది ఫెడరల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడంతో సహా ఫెడ్ తన వ్యయాల్ని తగ్గించుకునే ప్రయత్నాలు,సుంకాలు సహా పలు కీలక నిర్ణయలనుట్రంప్ తీసుకుంటున్నారు.దీంతో మస్క్ పై తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని ప్రభావం మస్క్ కంపెనీ అయిన టెస్లా కార్ల విక్రయాల పై పడింది. దీన్ని బహిష్కరించాలని పలువురు ఇటీవల నిరసన తెలిపారు. మరో వైపు ..టెస్లా యజమానుల వ్యక్తిగత వివరాలు బహిర్గతం అవుతున్నట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read: Ap weather: ఏపీ ప్రజలకు మాడు పగిలే వార్త...ఆ జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీల ఎండ..జాగ్రత్త!