/rtv/media/media_files/2025/02/12/bilYElrgtMdYFK7orEmx.jpg)
musk
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు ట్రంప్ మరిన్ని అధికారాలు అప్పజెప్పారు.ఈ మేరకు ఆయన నిర్వర్తిస్తున్న డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అధ్యక్షుడు తాజాగా సంతకం చేశారు. ఆ సమయంలో మస్క్ ఓవల్ ఆఫీస్ లోనే తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి కనిపించారు.
Also Read: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే
తాజా నిర్ణయంతో అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పై ఫెడరల్ ఏజెన్సీలు డోజ్ సహకారం, సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు,నియమకాల పై నిర్ణయం తీసుకోవాలని తాజా ఉత్తర్వుల్లో ట్రంప్ ఆదేశించారు. ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన మేరకు మాత్రమే నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు.
Also Read:Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!
దావాలను పట్టించుకోకుండా...
అనంతరం వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డోజ్ పని తీరును అధ్యక్షుడు ప్రశంసించారు.దావాలను పట్టించుకోకుండా డోజ్ ను ముందుకు తీసుకుని వెళ్లాలని టెస్లా సీఈఓకు సూచించారు. ఆ తరువాత మస్క్ మాట్లాడుతూ...ప్రభుత్వ పరంగా భారీ సంస్కరణల కోసమే ప్రజలు ఓటు వేశారు. అదే ఇప్పుడు ప్రజలకు అందబోతుంది. ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా...డోజ్ విభాగం సాధ్యమైనంత పారదర్శకంగా పని చేసేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. వృథా ఖర్చులు, అనవసర నియామకాలను తగ్గించకపోతే అమెరికా దివాలా తీస్తుందన్నారు.
ట్రంప్ ఈఉత్తర్వుల పై సంతకాలు చేస్తున్న సమయంలో మస్క్ ఆయన పక్కనే ఉండడం గమనార్హం. ప్రపంచ కుబేరుడితో పాటు ఆయన నాలుగేళ్ల కుమారు ఎక్స్ ఏ క్సి కూడా వైట్ హౌస్ లో ఆయన తో పాటు ఉన్నారు.దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ మద్ధతు అందించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు పాలకవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖ సారథిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే ఈ విభాగం పని. అయితే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ జోక్యంఎక్కువగా ఉంటుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీటిని ట్రంప్ ఖండిస్తూ వస్తున్నారు.
Also Read: PM Modi: పారిస్ ఏఐ సమ్మిట్.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ