/rtv/media/media_files/2026/05/13/iran-2026-05-13-14-30-06.jpg)
Iran
ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ దేశాలకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంపై మళ్లీ దాడులు చేస్తే యురేనియం శుద్ధిని 90 శాతానికి పెంచుతామని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి ఇబ్రహీ రెజాయీ ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల తయారీకి కావాల్సిన స్థాయికి యురేనియాన్ని శుద్ధి చేయగలమని పేర్కొన్నారు.
గతేడాది జూన్‌లో ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల వల్ల ఇరాన్ అణు సామర్థ్యం దెబ్బతిన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం స్థితిగతులపై ఇంకా క్లారిటీ లేదు. ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ ఇరాన్ మాత్రం తన పట్టు వీడటం లేదు.
Also Read: విజయ్ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు
ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య ఇప్పటిదాకా ఎలాంటి శాంతి ఒప్పందాలు కుదరలేదు. ఇరాన్ తన షరతులకు లోబడి ముందడుగు వేస్తామని చెబుతోంది. కానీ అమెరికా మాత్రం ఇరాన్ తన అణు ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఈ ప్రతిష్టంభన పశ్చిమాసియాలో ఆందోళనలను పెంచుతోంది.
అయితే తాము ప్రతిపాదించిన 14 సూత్రాలను అంగీకరించడం తప్ప అమెరికాకు మరో మార్గం లేదని ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఖర్ ఘాలిబాఫ్ తేల్చిచెప్పారు. ఈ విషయంలో అమెరికా ఎంత ఆలస్యం చేస్తే.. అక్కడి పన్ను చెల్లింపుదారులు అంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తాము ఎప్పుడైనా ప్రతీకార దాడులకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. మొత్తానికి తమపై దాడులు చేస్తే యురేనియం శుద్ధిని పెంచుతామని ఇరాన్ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్నిబట్టి తాము అణ్వాయుధాలు తయారు చేస్తామని ఇరాన్ పరోక్షంగా సంకేతాలిస్తోంది.
Also Read: అమెరికా ముందు పాక్ ను అడ్డంగా ఇరికించిన చైనా.. భలే దెబ్బ కొట్టిందిగా!
Follow Us