/rtv/media/media_files/2026/04/07/massive-explosion-rocks-fuel-tanker-near-panama-canal-bridge-2026-04-07-16-59-47.jpg)
Massive Explosion Rocks Fuel Tanker Near Panama Canal Bridge
సెంట్రల్ అమెరికాలోని పనామా సిటీలో 'బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్' సమీపంలో భారీ పేలుడు సంభవించింది. లా బోకాలోని బల్బో వద్ద ఉన్నటువంటి ఇంధన నిల్వ కేంద్రంలో ఓ ట్యాంకర్ ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా పేలుడు జరిగింది. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మంటలు క్షణాల్లో మరో రెండు ట్యాంకర్లకు వ్యాపించాయి. అక్కడ అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. అయితే ఈ పేలుడు నేరుగా వంతెన మీద జరగలేదు. కానీ ఆ బ్రిడ్జి కింద ఉన్న ట్యాంకర్ల నుంచి మంటలు ఎగిసిపడి బ్రిడ్జి పైభాగానికి చేరుకున్నాయి.
Also Read: కోమాలో ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ.. ప్రాణత్యాగానికి సిద్ధమన్న పెజెష్కియాన్
ఈ ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై వాహనాలు అలాగే ప్రయాణించాయి. మంటల్లోంచి వెళ్లిన వాహనాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ మంటలు రావడం వల్ల బ్రిడ్జి నిర్మాణానికి ఏదైనా నష్టం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
WILD FOOTAGE 🔴
— Open Source Intel (@Osint613) April 6, 2026
A tanker blast near the Bridge of the Americas in Panama City ignited a major fire that spread to 2 additional storage units at the Balboa tank facility. Reports of 3 injuries, no foul play suspected (as of now) pic.twitter.com/GeAcicCVQe
Also Read: యుద్ధం ఆపడానికి: అమెరికా ముందు ఇరాన్ 10 కండీషన్లు.. ట్రంప్‌కు షాక్
పనామా కెనాల్‌కు ఈ బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ అత్యంత కీలకమైన రవాణా మార్గంగా ఉంది. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే ఇరువైపులా ట్రాఫిక్‌ను ఆపేశారు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ..వంతెన పటిష్టతను ఇంజనీర్లు పరీక్షించిన తర్వాతే వాహనాలకు పర్మిషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
Follow Us