USA: కరేబియన్ సమద్రంలో భారీ భూకంపం..అమెరికాకు సునామీ హెచ్చరికలు

కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌కు ఉత్తరాన రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది. దీని కారణంగా అమెరికాకు సునామీ ముప్పు ఉందని జియోలాజికల్‌ సర్వే సంస్థ హెచ్చరించింది. 

author-image
By Manogna alamuru
New Update
usa

Earth Quake In carabien Sea

భారీ భూకంపం కరేబియన్ సముద్రాన్ని అల్లల్లాడించింది. కేమన్ దీవులకు నైరుతి వైపు కరేబియన్ సముద్రంలో రెక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే దీనివలన భూమిపై ప్రభావం ఏర్పడిందో లేదో ఇంకా తెలియలేదు. నిన్న రాత్రి యునైటెడ్ స్టేట్స్ కు చెందిన జియోలాజికల్ సర్వే ఈ భారీ భూకంపాన్ని గుర్తించింది. 

 

అమెరికాకు సునామీ..

దీని ప్రభావం కోస్టారికా, నికరగువా, కొలంబియా, క్యూబా దేశాలపై ప్రభావం చూపించిందని చెప్పింది. దీని కారణంగా అమెరికాను సునామీ ముంచెత్తే అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే సంస్థ హెచ్చరించింది. అక్కడి ప్రధాన భూభాగంపై ఈ భూకంపం ప్రభావం ఉండొచ్చని చెబుతోంది. క్యూబా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో  1-3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అమెరికా నేషనల్ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

Also Read: Cinema: సుకుమార్ మా జీవితాలకు అర్థం తీసుకొచ్చారు..అల్లు అర్జున్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TANA- ATA Scam: 950 ఉద్యోగుల తొలగింపు.. తానా-ఆటా కోసం మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణం

తానా, ఆటా వంటి తెలుగు సంఘాలు మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణానికి పాల్పడి సంస్థల నిధులను దుర్వినియోగం చేశాయి. ఈ కారణంగా దాదాపు 950 మంది తెలుగు వారు ఉద్యోగాలు కోల్పోయారు. మరో 1500 మంది త్వరలోనే ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది.

author-image
By Nikhil
New Update
TANA-ATA Scam

TANA-ATA Scam

TANA- ATA Scam: తానా, ఆటా తదితర సంఘాలకు నిధుల పేరుతో పలువురు తెలుగు ఉద్యోగులు సొంత కంపనీలను ముంచారు. మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణానికి పాల్పడి 950 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరో 1500 మంది కూడా త్వరలోనే ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటా, తానా తదితర సంస్థలు కూడా విచారణ ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే తెలుగువారికి అండగా ఉండకుండా.. ఇలాంటి చర్యలకు ప్రోత్సహిస్తున్న సంస్థలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఫ్యానీ మే (Fannie Mae) సంస్థ 950 మందిని తొలగించింది. వీరిందరినీ నైతిక కారణాలతోనే తొలగించినట్లు తెలుస్తోంది. తెలుగు సంఘాలు, వాటిని నడిపే పెద్దల కోసం మ్యాచింగ్ గ్రాంట్‌ ప్రోగ్రామ్‌లో అక్రమాలకు పాల్గొనడమే వీరి ఉద్వాసనకు ప్రధాన కారణమని సమాచారం. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), ఆటా (ATA) వంటి స్వచ్ఛంద సంస్థలు కొందరు ఉద్యోగులతో కుమ్మక్కై వారు పని చేసే కంపెనీ నిధులను దుర్వినియోగం చేశారు. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు TANA రీజినల్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కూడా ఉన్నారు. మరొకరు మరో టాప్ సంస్థ ఆటా మాజీ ప్రెసిడెంట్ సతీమణి అని సమాచారం. కేవలం తానా, ఆటా మాత్రమే కాదు.. ఇలాంటి అనేక సంస్థలు కూడా ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణంలో భాగమైనట్లు తెలుస్తోంది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

ఈ అసోసియేషన్లు చేసిన అనైతిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు యాపిల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ ఈ ఏడాది జనవరిలో దాదాపు 100కు పైగా ఉద్యోగులను తొలగించింది. వాళ్లంతా కూడా ఈ సంఘాలతో కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ కేడర్ నుంచి ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అమెరికాలో కంపెనీల ట్యాక్స్ లెక్కలు చూసే ఇంటర్‌నల్ రెవెన్యూ సర్వీస్(IRS) వీళ్ల గుట్టును రట్టు చేసింది. మరో ఐటీ దిగ్గజం గూగుల్ సైతం గతంలో ఇదే రకమైన ఆరోపణలతో తెలుగు ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

కులానికో సంఘం..

అమెరికాలో ఉన్న తెలుగు వారంతా TANA-తెలుగు అసోసియేషన్ ఫర్ నార్త్ అమెరికా, NATA-నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ATA- అమెరికన్ తెలుగు అసోసియేషన్, APTA-అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, NATS-నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, NIRVA వంటి సంఘాలుగా ఏర్పడ్డారు. అమెరికాలో కాపులు, కమ్మలు, రెడ్లు కుల సంఘాలుగా ఏర్పడి ఈ ఆర్గనైజేషన్స్ ను నడిపిస్తాయి. యాపిల్ సంస్థ డొనేషన్స్‌ను ఈ తెలుగు సంఘాల్లో ఉన్న ఉద్యోగులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిని తొలగించారు.

Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

మ్యాచింగ్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి..

వివిధ కంపెనీలు మ్యాచింగ్ గిఫ్ట్స్ ప్రోగ్రామ్ (Matching Gifts Programme) ద్వారా నాన్-ప్రాఫిట్ సంస్థలకు ఫండింగ్ ఇస్తూ ఉంటాయి. అంటే ఉద్యోగి ఓ సంస్థకు ఎంత డబ్బును విరాళంగా ఇస్తే.. సదరు కంపెనీ కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఈ డబ్బుపై ట్యాక్స్ కూడా ఉండదు. దీంతో ఈ రూల్ ను పలువురు ఉద్యోగులు తమకు అస్త్రంగా మార్చుకున్నారు. ఈ ఉద్యోగులు తానా, ఆటా వంటి సంస్థలతో కుమ్మక్కై తప్పుడు లెక్కలు చూపిస్తారు. తాము విరాళాలు ఇచ్చినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ ను సృష్టిస్తారు.  ఇలా వారు పని చేసే కంపెనీ నుంచి తానా, నాటా లాంటి సంస్థలకు విరాళాలు ఇప్పించి.. ఆ డబ్బులను తమ ఖాతాలకు మళ్లించినట్లు వీరిపై అభియోగాలు ఉన్నాయి. అయితే.. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇలాంటి అవకతవకలకు పాల్పిన వారిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 1500 మంది కూడా ఇలానే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న వార్తలు అగ్ర రాజ్యంలో ఉంటున్న తెలుగు వారికి టెన్షన్ పుట్టిస్తోంది.

Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment