/rtv/media/media_files/2025/03/10/awlE8ej7B48kjMgtze4w.jpg)
mark
కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, ట్రంప్ నుంచి విలీన ముప్పు, ఫెడరల్ ఎన్నికలు వంటి అనేక సవాళ్ల నేపథ్యంలో ఆయన కెనడాకు 24వ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్ సమక్షంలో కార్నీ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read:Telangana: తెలంగాణ వాసులకు బిగ్ అలెర్ట్.. 5 రోజులు మండే ఎండలు...!
ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించారు. దీనితో అధికార లిబరల్ పార్టీకి కొత్త సారథి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో జరిగిన ఎన్నికల్లో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లకు గతంలో గవర్నర్‌గా పనిచేసిన కార్నీ ఘన విజయం సాధించారు. అమెరికా-కెనడా సంబంధాలు దెబ్బతింటున్న సమయంలో మార్క్ కార్నీ బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
1965లో ఫోర్ట్ స్మిత్‌లో జన్మించిన మార్క్ కార్నీ హార్వర్డ్‌లో ఉన్నత విద్య ను చదివారు. గోల్డ్‌మన్ శాక్స్‌తో ప్రయాణం ప్రారంభించి, బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా కార్నీ పనిచేశారు. 2008-09 ఆర్థిక సంక్షోభం వేళ పరిష్కార మార్గాలను అన్వేషించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడిన అనంతరం ఐక్య రాజ్య సమితి ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా మార్క్ కార్నీ అనేక సేవలందించారు. ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం లిబరల్స్ పార్టీ సారథి రేసులో నిలిచి విజయం అందుకున్నారు. గతంలో ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్‌లో అనుభవం లేని కార్నీ- కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం మరో విశేషం.
Also Read: ట్రైన్ హైజాక్‌లో భారత్ హస్తముందున్న పాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా