/rtv/media/media_files/2026/02/25/london-indian-restaurant-to-close-after-16-years-2026-02-25-16-14-31.jpg)
London Indian restaurant to close after 16 years
లండన్‌లో భారత సంతతి వ్యక్తి హర్మాన్ సింగ్ కపూర్‌కు చెందిన ఇండియన్ రెస్టారెంట్‌పై దాడులు జరగడం చర్చనీయాంశమవుతోంది. గత కొంత కాలంగా పాకిస్థానీయులు అతడి రెస్టారెంట్‌పై తరచూ దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 16 ఏళ్లుగా నడిపిస్తున్న తన రెస్టారెంట్‌ను వచ్చే నెలలో శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. రెస్టారెంట్ నడిపేందుకు వాళ్లు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజూ వేధిస్తున్నారని వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
హర్మాన్ సింగ్ కపూర్ అనే వ్యక్తి లండన్‌లోని హ్యామ్మర్‌స్మిత్ ప్రాంతంలో 16 ఏళ్లుగా ఇండియన్ రెస్టారెంట్‌ను నడిపిస్తున్నాడు. కొందరు తీవ్రవాదులు, ముఖ్యంగా పాకిస్తానీయులు తరచుగా దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, పోలీసులు తనకు అండగా ఉండకపోవడం వల్లే తాను ఈ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. తనకు ఇన్నిరోజులు సపోర్ట్‌గా ఉన్నవాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తన వ్యాపారాన్ని అతివాదులు అడ్డుకున్నప్పటికీ తన ఆలోచనలను అడ్డుకోలేరని తెలిపాడు. ఇకనుంచి తన సిద్ధాంతాల కోసమే పూర్తిగా సమయం కేటాయిస్తానని అన్నాడు.
Also Read: ఇండియాకు ట్రంప్ 'బిగ్ షాక్'.. మళ్లీ మొదలైన ట్రేడ్ వార్.. వాటిపై 126% సుంకాలు!
హర్మాన్‌సింగ్ గతంలో లండన్‌లో జరిగిన ఖలిస్తానీ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అక్కడ పెరుగుతున్న హింస, అతివాద భావాజాలన్ని విమర్శించారు. ఖలిస్థాన్ వేర్వాటువాద నేత అమృత్‌పాల్ పాల్ సింగ్‌పై కూడా విమర్శలు చేశారు. దీంతో అప్పట్లో కూడా అతడి రెస్టారెంట్‌పై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. బ్రిటన్‌లోని కొన్ని పాకిస్థానీ గ్రూపులు ఖలిస్థానీ శక్తులతో చేతులు కలిపి భారత్‌కు సపోర్ట్‌గా మాట్లాడే సిక్కులను టార్గెట్ చేసుకుంటున్నాయని ఆయన చెబుతున్నారు.
లండన్ మేయర్ పాకిస్థానీయుడే
లండన్ ప్రస్తుత మేయర్ సాదిక్ ఖాన్. ఇతడు పాకిస్థాన్ సంతతికి చెందిన వ్యక్తి. లేబర్ పార్టీకి చెందిన ఈయన 2016 నుంచి లండన్ మేయర్‌గా కొనసాగుతున్నారు. హర్మాన్ సింగ్ కపూర్ రెస్టారెంట్‌లో దాడులు జరుగుతున్నా కూడా మెట్రోపాలిటన్ పోలీసులు, లండన్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో లండన్ మేయర్ కూడా పాకిస్థానీయులకు మద్దతుగా ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
లండన్‌లో పాకిస్థానీయుల ఆధిపత్యం ?
లండన్‌లో పాకిస్థానీయుల ఆధిపత్యంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లండన్ మేయర్‌తో పాటు బ్రిటన్ రాజకీయాల్లో పాకిస్థానీ సంతతి వ్యక్తుల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. ఇది స్థానిక సిక్కు, హిందూ వర్గాల్లో కొన్నిసార్లు ఆందోళనలకు దారితీస్తున్నాయి. లండన్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ గ్రూపులు, ఖలిస్థాన్ మద్దతుదారులతో కలిసి భారత్‌కు అనుకూలంగా మాట్లాడేవాళ్లను టార్గెట్ చేసుకుంటున్నట్లు హర్మాన్ సింగ్ కపూర్ కూడా చెబుతున్నారు. దీంతో అక్కడ పాకిస్థానీయులు, ఖలిస్థానీ వేర్పాటువాదుల ఆధిపత్యం పెరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: ప్రధాని మోదీ ఇజ్రాయిల్ పర్యటన కీలకం.. ప్రపంచ దేశాలతో కొత్త ఇండియా కూటమి!
Follow Us