🔴Live Breakings: స్టార్ షిప్ ఎఫెక్ట్.. 240 విమానాల రాకపోకలకు అంతరాయం

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 08, 2025 20:35 IST

    Lalit Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

    ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు లలిత్‌ మోదీ వనువాటు పౌరసత్వం పొందారు. ఐపీఎల్‌కు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో 2010లో ఆయన లండన్‌ పారిపోయాడు. తాజాగా వనువాటు దేశ పౌరసత్వం పొందడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    Lalit Modi Surrenders Indian Passport, Acquires Citizenship Of Vanuatu
    Lalit Modi Surrenders Indian Passport, Acquires Citizenship Of Vanuatu

     



  • Mar 08, 2025 10:11 IST

    రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆగవు!

    రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి బయల్దేరే రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రారంభ స్థానాన్ని చర్లపల్లికి మార్చింది. అలాగే చర్లపల్లి నుంచి దానాపూర్, ముజఫర్‌పూర్, కాకినాడ, నర్సాపూర్‌లకు ట్రైన్లు నడుపుతున్నట్లు తెలిపింది.

    South Central Railway To Run Two More Trains From Cherlapally Railway Terminal
    South Central Railway To Run Two More Trains From Cherlapally Railway Terminal Photograph: (South Central Railway To Run Two More Trains From Cherlapally Railway Terminal)

     



  • Mar 08, 2025 10:11 IST

    స్టార్ షిప్ ఎఫెక్ట్.. 240 విమానాల రాకపోకలకు అంతరాయం

    ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ నిన్న కూలిపోయింది. వరుసగా ఇది ఎనిమిదవ ప్రయోగం. అయితే నిన్న కూలిన రాకెట్ శకలాలు ఫ్లోరిడా, బహమాస్ లలో పడ్డాయి. దీనివలన నిన్న, ఈరోజు కలిపి మొత్తం 240 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. 



  • Mar 08, 2025 10:10 IST

    చంద్రమండలంపై సీక్రెట్స్ బయటపెట్టిన చంద్రయాన్ 3 మిషన్

    చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడిపై తాజా వాతావరణ పరిస్థితులను అధ్యాయనం చేసి డేటా పంపింది. డేటా ప్రకారం చంద్రుడిపై అంచనాలను మించి మంచు, నీరు ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. మూన్‌పై పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతల్లో వేరియేషన్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

    Chandrayaan3's Vikram
    Chandrayaan3's Vikram Photograph: (Chandrayaan3's Vikram)

     



  • Mar 08, 2025 10:10 IST

    సిరియాలో పోలీసుల మృతితో ప్రభుత్వం రివేంజ్.. అసద్ గ్యాంగ్ లో 200 మంది మృతి!

    సిరియా తీరప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. ఇది అసద్ గ్రూపునకు, ప్రభుత్వ దళాలకు చెందిన హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని గ్యాంగ్ చేసిన ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు.

    Read More : https://rtvlive.com/international/revenge-attacks-on-assad-group-in-syria-8832683



  • Mar 08, 2025 10:08 IST

    మరో వారంలో ఇందిరమ్మ ఇళ్ళు.. మంత్రి పొంగులేటి

    ఇందిరమ్మ ఇళ్ళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. మరో వారం రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు.  అర్హులైన వారిని ఎంపిక చేసి..పనులు మొదలుపెడతామని తెలిపారు.



  • Mar 08, 2025 10:08 IST

    KCR ఫామ్ హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే హాస్పిటల్‌పాలు

    ఎర్రవల్లి ఫామ్‌హౌస్ మీటింగ్‌కు వెళ్లిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థత చెందారు. సమావేశం అనంతరం తిరిగివస్తుండగా ఆమె అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఆమెకు ఇలా అయ్యిందని డాక్టర్లు తెలిపారు.

    Also Read : https://rtvlive.com/telangana/mla-sabitha-indra-reddy-falls-ill-after-attending-a-meeting-at-erravalli-farmhouse-8832675



  • Mar 08, 2025 10:07 IST

    దారుణం.. మహిళతో అసభ్యప్రవర్తన.. అడ్డుకున్న విదేశీ టూరిస్టులపై దాడి!

    కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతిలో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పర్యాటకులపై దుండగులు దాడి చేసి తుంగభద్ర ఎడమ కాలువలోకి తోసేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు టూరిస్టులు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. మరొకరు గల్లంతయ్యారు.

    foreign tourists attacked by miscreants in Gangavathi karnataka
    foreign tourists attacked by miscreants in Gangavathi karnataka Photograph: (foreign tourists attacked by miscreants in Gangavathi karnataka)

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు