/rtv/media/media_files/2026/02/18/key-changes-for-the-ts-eapcet-2026-2026-02-18-19-58-29.jpg)
Key Changes for the TS EAPCET 2026
ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్ 2026కు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈ పోటీ పరీక్షకు హాజరైన స్టూడెంట్స్ తమకు ఎన్ని మార్కులు వస్తాయనేది ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు. పరీక్ష ముగిసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై వాళ్లకి ఎన్ని మార్కులు వస్తాయో కనిపిస్తుంది. అలాగే ఆ మార్కులకు ఎంత ర్యాంకు వచ్చే ఛాన్స్ ఉందనే విషయాన్ని కూడా విద్యార్థులు తెలుసుకోవచ్చు.
దీనికోసం గత రెండేళ్ల ఫలితాల ఆధారంగా వచ్చిన ర్యాంకులను ఎప్‌సెట్ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తు చేసుకునే విషయంలో కూడా అధికారులు మార్పులు తీసుకొచ్చారు. ఇకనుంచి విద్యార్థులు మొబైల్ ఫోన్‌లోనే దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ కొత్త మార్పులకు సంబంధించిన వివరాలు ఎప్‌సెట్ 2026 కన్వీనర్ విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఫోన్‌లోనే ఈ పరీక్షకు అప్లై చేసుకునేలా ఈసారి మొబైల్ అడాప్టివ్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Also Read: ఇండియా ఇజ్జత్ యూనివర్సిటీ.. సోషల్ మీడియాలో చైనా డాగ్ రోబోట్ రచ్చ రచ్చ
ఇక్కడ మరో విషయం ఏంటంటే దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి ఎంపీకికి బదులు బైపీసీ ఎంపిక చేసినా, లేదా బైపీసీకి బదులు ఎంపీసీ సెలెక్ట్ చేసినా మీరు తప్పు చేశారని ఎప్‌సెట్ నిర్వాహకుల నుంచి ఫోన్ వస్తుంది. ఇలాంటి నూతన విధానాన్ని 2026లోనే తీసుకొచ్చారు. ఇంటర్మీడియ్ బోర్డు నుంచి తీసుకున్న వివరాల ఆధారంగానే ఈ పర్యవేక్షణ జరుగుతుంది. ఏ విద్యార్థి అయిన దరఖాస్తు ప్రక్రియలో తప్పులు చేస్తే ఎప్‌సెట్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది. ఇలా చేయడం వల్ల దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇదిలాఉండగా గురువారం నుంచే ఎప్‌సెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎవరైనా వివిధ కారణాల వల్ల ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేయకుంటే పరీక్షకు రెండ్రోజుల ముందు కూడా రూ.10 వేల జరిమానాతో దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ జరిగిన నేపథ్యంలో ఎస్సీ 1,2,3 కేటగిరీ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఎప్‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 4,5 తేదీల్లో జరగనున్నాయి. ఇక ఇంజనీరింగ్ పరీక్షలు మే 9,10,11 తేదీల్లో నిర్వహించనున్నారు.
Also Read: బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ ?
Follow Us