/rtv/media/media_files/2026/03/14/karrar-drone-2026-03-14-14-10-42.jpg)
karrar-drone-is-considered-major-threat-to-us-military-know details
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ అమ్ములపొదిలో ఓ శక్తిమంతమైన ఆయుధం వెలుగులోకి వచ్చింది. అదే కర్రార్ UAV. ఇది కేవలం నిఘా డ్రోన్ మాత్రమే కాదు. జెట్ శక్తితో పనిచేసే ఈ డ్రోన్ బాంబర్‌గా, ఆత్మాహుతి దాడి చేసే క్షిపణిగా పనిచేస్తుంది. ఈ ఆయుధమే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌కు ఆందోళన కలిగిస్తోంది. కర్రార్ యూఏవీ ఇప్పుడు యుద్ధ వ్యూహాన్నే మార్చేస్తోంది.
Also Read: జపాన్‌పై ఉత్తరకొరియా దాడి.. 10 మిసైళ్లతో ఎటాక్
ఏంటీ ఈ కర్రార్ డ్రోన్
ఈ కర్రార్ డ్రోన్ 2010లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతోనే దీన్ని రూపొందించారు. సాధారణ డ్రోన్లను చూసుకుంటే ప్రొపెల్లర్లతో మెల్లగా ఎగురుతుంటాయి. కానీ కర్రార్ మాత్రం అలా ఉండదు. యుద్ధ విమానాల లాగే జెట్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. అత్యంత వేగంతో లక్ష్యాలను చేరుకొని దాడులు చేయగల సామర్థ్యం ఉంటుంది. దీనికి ఉన్న టర్బోజెట్ ఇంజిన్ వల్ల గంటకు 900 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. అంతేకాదు ఇది శత్రువుల రాడర్లకు కూడా చిక్కకుండా లక్ష్యాన్ని ఛేదించగలదు. సాధారణంగా ఇది 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కానీ ఆత్మాహుతి మిషన్లలో మాత్రం ఇది తిరిగిరావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మరింత ఎక్కువ దూరం వెళ్లి దాడులు చేయగలదు.
Also Read: ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు.. అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్
ఈ డ్రోన్‌కు రన్‌వే అవసరం ఉండదు. ఎడారిలో అయినా లేదా చిన్న ట్రక్కు మీద నుంచి అయినా రాకెట్ బూస్టర్ సాయంతో దీన్ని ప్రయోగించవచ్చు. లక్ష్యాన్ని ఛేదించాక పారాచూట్ ద్వారా సురక్షితంగా మళ్లీ కిందకు వస్తుంది. దీనికి కొత్తగా మాజిద్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను అమర్చారు. దీంతో ఇది గాల్లోనే అమెరికా డ్రోన్లలను లేదా హెలికాప్టర్లపై దాడులు చేయగలదు.
Follow Us