America: వైట్‌ హౌస్‌ పై దాడికి యత్నం..భారత సంతతి యువకుడికి 8 ఏళ్ల జైలు!

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వద్ద 2023 లో భారత సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ కేసులో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్‌ వెల్లడించారు.

New Update
sai

sai

America: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వద్ద 2023 లో భారత సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో నిందితుడైన తెలుగు సంతతి వ్యక్తి 19 సంవత్సరాల కందుల సాయి వర్షిత్‌ ను అప్పట్లోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ కేసులో అతడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు జడ్జి డాబ్నీ ఫ్రెడ్రిచ్‌ వెల్లడించారు.

Also Read: Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు!

నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు యత్నించాడని పేర్కొన్నారు. కోర్టు పత్రాల ప్రకారం..2023 మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నుంచి సాయి వర్షిత్‌ వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్‌ వద్దకు వెళ్లి సైడ్‌ వాక్‌ పై వాహనాన్ని నడిపాడు.

Also Read: నాంపల్లి నుమాయిష్ లో తప్పిన పెను ప్రమాదం.. తలకిందులుగా ఇరుక్కుపోయిన జనం

పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన  ట్రాఫిక్‌ బారియర్స్‌ ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు మొదలు పెట్టాడు.

బైడెన్‌ ను హత్య చేయాలనే...

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ ను హత్య చేయాలనే లక్ష్యంత ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు అధికారులు పేర్కొననారు. ఇందుకోసం అతడు ఆరు నెలలుగా ప్లాన్‌ చేసి మరీ ఈ ఘటనకు పాల్పడినటలు తేలింది.

ఈ విషయాన్ని సాయి వర్షిత్‌ విచారణలో ఒప్పుకున్నట్లు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ వర్గాలు మీడియాకు చెప్పాయి. దీంతో అతడిని అరెస్ట్‌ చేశారు.

Also Read: Breaking: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!

Also Read: Ap Liquor: ఓరి మీ దుంపలు తెగ..అన్ని కోట్లు ఎలా తాగేశార్రా బాబు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు