/rtv/media/media_files/2026/04/13/jd-vance-as-scapegoat-2026-04-13-13-58-45.jpg)
JD Vance as Scapegoat ? The Fallout of the Failed Iran-U.S. Talks
అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లు కనిపిస్తోంది. ఇరాన్తో ఒప్పందం కుదిరినట్లయితే ఆ క్రెడిట్ తనకేనని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఒకవేళ విఫలమైతే ఆ నిందను వాన్స్పై వేస్తానని తెలిపారు. అయితే పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఈ చర్చల నుంచి వాన్స్ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడంతో.. ట్రంప్ తన వ్యూహం ప్రకారం వాన్స్ను బలిపశువును చేసే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే దౌత్యపరమైన అనుభవం లేని వాన్స్ను ఇలాంటి చర్చలకు పంపించడం వెనుక ట్రంప్ రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా వాన్స్కు పేరున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయనతోనే స్వయంగా పాకిస్థాన్లో చర్చలు జరపాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. వాన్స్ బృందం చర్చలకు వెళ్లే ముందే చర్చల విషయంలో ట్రంప్ పలు కఠినమైన నిబంధనలు పెట్టారు. దీంతో ఇవి వాన్స్ పనిని మరింత కష్టతరంగా మార్చేశాయి. అయితే దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పరిష్కరించడం చిన్న విషయం కాదు. అయినప్పటికీ ఈ వైఫల్య నిందను వాన్స్పై నెట్టేందుకు ప్రయత్నం జరుగుతోంది.
Also Read: దేశంలో ఉగ్రవాదులకు పాస్ పోర్టులు, ఆధార్లు.. వెలుగులోకి సంచలన నిజాలు
మరోవైపు వైట్హౌస్లో జేడీ వాన్స్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ లాంటి వారు ట్రంప్కు విధేయులుగా ఉంటూ పట్టు సాధిస్తున్నారు. కానీ జేడీ వాన్స్ను మాత్రం మినహాయిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ లాంటి కీలక నేతలను ట్రంప్ తొలగించారు. అయితే ఇప్పుడు ఆయన తన అసంతృప్తిని వాన్స్ వైపు మళ్లించే ఛాన్స్ ఉంది. ఉపాధ్యక్షుడిని పదవి నుండి తొలగించడం రాజ్యాంగబద్ధంగా అసాధ్యం. కానీ ఈ వైఫల్యం వంకతో వాన్స్ను రాజకీయంగా దెబ్బతీయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
అధ్యక్ష పదవి కష్టమే
ఇదిలాఉండగా ఈ చర్చల ఫలితంపై ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్తో ఒప్పందం కుదిరినా.. కుదరకపోయినా తనకు ఎలాంటి పట్టింపు లేదంటున్నారు. తాము ఇప్పటికే గెలిచినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్ వ్యవహారం మళ్లీ యుద్ధానికి దారితీస్తే, చర్చల వైఫల్యానికి వాన్స్ను బాధ్యుడిని చేసి ట్రంప్ తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు రిపబ్లికన్ పార్టీలో వాన్స్ అధ్యక్ష పదవి ఆశలపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక భవిష్యత్తులో జేడీ వాన్స్కు అధ్యక్ష పదవి రావడం కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: నీకో దండం రా బాబు.. ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చిన గల్ఫ్ కంట్రీలు.. అసలేమైందో తెలుసా?
Follow Us