Dating: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. డేటింగ్ చేస్తే రూ.12 వేలు ఆర్థిక సాయం

జపాన్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ అక్కడ జనాభా సంక్షోభంతో ఆందోళనలు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే ఆ దేశంలోని కోచి ప్రిఫెక్చర్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటింగ్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ కింద రూ.12 వేల సబ్సిడీని అందిస్తోంది. 

New Update
Japan Pays Singles Rs 12,000 To Use Dating Apps In Desperate Bid To Boost Birth Rate

Japan Pays Singles Rs 12,000 To Use Dating Apps In Desperate Bid To Boost Birth Rate

ప్రపంచంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో జపాన్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఆ దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ అక్కడ జనాభా సంక్షోభంతో ఆందోళనలు నెలకొన్నాయి. యువత పెళ్లిల్లపై ఆసక్తి చూపించకపోవడంతో జననాల రేటు దారుణంగా పడిపోయినట్లు జపాన్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే ఆ దేశంలోని కోచి ప్రిఫెక్చర్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఓ వినూత్న పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. డేటింగ్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ కింద రూ.12 వేల సబ్సిడీని అందిస్తోంది. 

కోచి ప్రిఫెక్చర్ అనే రాష్ట్రంలో 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఒంటరిగా ఉన్న వ్యక్తులకు డేటింగ్‌ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కోసం 20,000 యెన్ల (దాదాపు రూ.12,000) వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. రిజిస్ట్రేషన్ ఫీజులు, మంత్లీ ఛార్జీల రశీలు ఇస్తే.. ఆ డబ్బును ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తోంది.  

Also Read: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ?.. హర్మూజ్ జలసంధిలో కాల్పులు

మరోవైపు రాజధాని టోక్యో కూడా జనాభాను పెంచే విషయంలో ముందడుగు వేసింది. టోక్యో ఫుటారి స్టోరీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటింగ్‌ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌లో దాదాపు 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ల వ్యక్తిత్వం, అలవాట్లు, భవిష్యత్తుపై ఆశలు, పిల్లల పట్ల అభిప్రాయాలు లాంటి అంశాలను ఏఐ విశ్లేషిస్తుంది. ఆ తర్వాత ఆ డేటా ఆధారంగా వాళ్లకి సరిగ్గా సరిపోయే భాగస్వామిని ఈ యాప్ సెలెక్ట్ చేస్తుంది. 

కానీ ఈ యాప్‌లో చేరడం అంతా ఈసీ కాదు. ప్రైవేట్ యాప్‌ల లాగే మోసాలు జరగకుండా ప్రభుత్వం ఇందులో కఠిన రూల్స్ పెట్టింది. ఇందులో చేరాలనుకునే యువత తమ ఆదాయ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. తాము అవివాహితులమని ప్రభుత్వం నుంచి పొందే సింగిల్ స్టేటస్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. అంతేకాదు ఓ ప్రత్యేక ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఈ యాప్‌లో ఉంటారు. 

Also Read: IRGC చేతుల్లోకి ఇరాన్ పగ్గాలు.. అధ్యక్షుడు పెజెష్కియాన్ డమ్మీయేనా?

ప్రస్తుతం జపాన్‌లో చాలమంది యువత పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. చేసుకున్నా పిల్లలు కనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆ దేశలో జననాల రేటు రోజురోజుకి పడిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే జపాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో మియాజాకి లాంటి ప్రాంతాల్లో రూ.6 వేల ఆర్థిక సాయం అందించింది. తాజాగా కోచి ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. 

Advertisment
తాజా కథనాలు