/rtv/media/media_files/2025/03/02/9OfbFjpeVHaU3wtdffyt.jpg)
Japan Fire News
జపాన్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇవాట్ ప్రిఫెక్చర్‌లోని ఓఫునాటో నగరంలోని అడవిలో మంటలు భారీ స్థాయిలో ఎగసిపడుతున్నాయి. జపాన్ మీడియా ప్రకారం.. ఇప్పటివరకు ఈ మంటల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా 80 కి పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని జపాన్ మీడియా తెలిపింది.
ఇది కూడా చూడండి: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..
4450 ఎకరాల్లో మంటలు
దీంతో మంటలు వ్యాపించడంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. వెంట వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం మొదలు పెట్టింది. అయితే వేడి గాలుల కారణంగా మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 1800 హెక్టార్ల (4450 ఎకరాలు) కంటే ఎక్కువ విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి.
ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
Japan witnesses worst wildfire in 30 years: 1 Dead, thousands evacuated amid fierce blaze
— upuknews (@upuknews1) March 2, 2025
According to local media reports, the flames have spread across approximately 1,200 hectares of forest in Ofunato, located in the northern region of Iwate.
More than 80 buildings have been… pic.twitter.com/PJUopPeGXb
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
కాగా జపాన్ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన అగ్నిప్రమాదంగా చెప్పబడింది. ఇప్పటి వరకు ఇలాంటి భారీ అగ్ని ప్రమాదం జపాన్‌లో సంభవించలేదు. మొదట ఓఫునాటో పట్టణంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అవి కాస్త పెద్దవిగా మారి భారీ స్థాయిలో మంటలు అడవులను చుట్టుముట్టాయి. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు కాలిపోయిన ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో 80 భవనాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
అగ్నిప్రమాదం కారణంగా ఓఫునాటో, సాన్రికు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జపాన్‌కు చెందిన ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎఫ్‌డిఎంఎ) కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఏజెన్సీ ప్రకారం, 1992 తర్వాత జపాన్‌లో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాదంగా వెల్లడించింది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ, అత్యవసర విభాగం సిబ్బంది మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వేడి గాలులు కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో హెలికాప్టర్ల సాయం కూడా తీసుకుంటున్నారు.