/rtv/media/media_files/2025/03/21/M6mCpYiaaLej1nWqIe9P.jpg)
Attacks On Gaza
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం మూడు రోజుల క్రితమే ముగిసింది. అప్పటి నుంచీ ఇజ్రాయెల్ గాజా పై దాడులు మొదలుపెట్టింది. వైమానిక దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తోంది. హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. సీజ్ ఫైర్ ఒప్పందానికి హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోంది. అలాగే అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. అందుకే దాడులు చేస్తున్నామని అన్నారు. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడుతోంది ఐడీఎఫ్. రెండు రోజుల క్రితం చేసిన దాడుల్లో మొత్తం 400 మందికి పైగా పాలస్తీనావాసులు మృతి చెందారు. వీరిలో ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారు. రఫా, ఉత్తర గాజా, గాజాసిటీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయి.
ఈరోజు మళ్ళీ దాడులు..
గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు పాల్పడింది. తాజాగా చేసిన అటాక్ లో 85 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో పౌరులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. మరోవైపు హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నాయి. నిన్న యెమెన్ నుంచి రెండు క్షిపణులను హౌతీలు ప్రయోగించారు. అయితే వీటిని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. జెరూసలెం, టెల్ అవీవ్లలో సైరెన్లు మూగడంతో యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని కూల్చేసామని ప్రకటించింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించే ముందే రెండింటినీ అడ్డుకున్నామని తెలిపింది.
Also Read: USA: అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్