/rtv/media/media_files/2026/04/23/iran-2026-04-23-17-44-01.jpg)
Iran’s Mission to Rebuild Schools Amid War
ఇరాన్‌లో జరిగిన దాడుల్లో మౌలిక సదుపాయాలు ధ్వంసమవడమే కాకా.. దాదాపు 1300 పాఠశాలలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ప్రధానంగా టెహ్రాన్, కెర్మాన్‌షా, ఇస్ఫహాన్ , హోర్మోజ్‌గాన్ లాంటి కీలక ప్రావిన్సులలో ఎక్కువగా కనిపించింది. అయితే ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం విద్యా రంగాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 775 స్కూళ్లకు మరమ్మతులు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి అలీరెజా కజెమీ తెలిపారు. తీవ్రంగా దెబ్బతిన్న మిగిలిన స్కూళ్లను అక్టోబరు నాటికి పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితిలు కొనసాగినప్పటికీ అక్కడి విద్యా కార్యకలాపలు ఆగిపోకుండా ఇరాన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పాటించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించిన ప్రాంతంలో ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించారు. దాడుల ముప్పు ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఆన్‌లైన్ తరగతులను ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో "ఇరానియన్ టెలివిజన్ స్కూల్" విద్యార్థులకు పాఠాలు అందించడంలో కీలక పాత్ర పోషించింది. యుద్ధం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read: నావికాదళ కార్యదర్శిపై వేటు.. ఇరాన్ యుద్ధం వేళ ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మినాబ్ ప్రాంతంలోని షజరా తయ్యిబా స్కూల్‌పై జరిగిన దాడి తీవ్ర విషాదం నింపింది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఆ క్షిపణి దాడుల్లో సుమారు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు 7 నుంచి 12 ఏళ్ల లోపు బాలికలు, మహిళా ఉపాధ్యాయులే ఉండటం తీవ్ర దుమారం రేపింది. ఇలాంటి అమానవీయ ఘటనలో మరణించిన వాళ్లకి గుర్తుగా పాఠశాలల్లో స్మారక కార్యక్రమాలను నిర్వహించి నివాళులు అర్పించారు.
అమెరికా-ఇజ్రాయెల్ కలిసి పౌరులపై, ముఖ్యంగా చిన్నారులు ఉండే పాఠశాలలపై దాడులు చేసి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని ఇరాన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోమాహాక్ క్షిపణులతో ఈ దాడులు జరిగినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడులు కేవలం ఆస్తి నష్టాన్నే కాకుండా, విద్యార్థుల భద్రతపై కూడా పెను ఆందోళనలను రేకెత్తించాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యా విధానాన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించడమే తమ ప్రథమ లక్ష్యమని ఇరాన్ సర్కార్ స్పష్టం చేసింది.
Also Read: మధ్య ఆసియాపై కన్నేసిన బ్రిటన్.. రష్యా, చైనాలకు పోటీగా బిగ్ ప్లాన్
Follow Us