Iran: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. హర్మూజ్‌లో రోజుకు 15 నౌకలకు మాత్రమే పర్మిషన్

ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ గుండా రోజుకు కేవలం 15 నౌకలు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఇరాన్ సీనియర్ వర్గాలు రష్యా వార్తా సంస్థ 'టీఏఎస్‌ఎస్' (TASS) కు వెల్లడించాయి.

New Update
Iran's Approval, 15 Ships A Day, Strait Of Hormuz Opening Comes With Caveats

Iran's Approval, 15 Ships A Day, Strait Of Hormuz Opening Comes With Caveats


పశ్చిమాసియాలో రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అంతర్జాతీయ వాణిజ్యం పుంజుకుంటుందని అనుకున్న ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్‌షాక్ ఇచ్చింది. కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ఇరాన్ వదులుకోవడం లేదు. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ గుండా రోజుకు కేవలం 15 నౌకలు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని ఇరాన్ సీనియర్ వర్గాలు రష్యా వార్తా సంస్థ 'టీఏఎస్‌ఎస్' (TASS) కు వెల్లడించాయి. యుద్ధానికి ముందు ఉన్నట్లుగా ఈ జలసంధిపై స్వేచ్ఛా రవాణా ఇక సాధ్యం కాదని తేల్చిచెప్పాయి. ప్రతి నౌక ఇరాన్ ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పాయి.

Also read: ఇజ్రాయెల్ 'బ్రహ్మాస్త్రాలు'.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న హెర్మెస్ డ్రోన్లు!

అంతేకాదు ఈ రవాణా నియంత్రణ కూడా ఇరాన్ సాయుధ బలగాలైన 'ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్' (IRGC) పర్యవేక్షణలోనే ఉంటుందని ఇరాన్ తెలిపింది. ఇకనుంచి నౌకలు హర్మూజ్‌ను దాటాలంటే IRGC విధించే ప్రత్యేక రూల్స్‌ను పాటించడం, అలాగే టోల్ చెల్లించాల్సి ఉంటుందనే సంకేతాలిచ్చింది. ఇక నౌకల రాకపోకలకు సంబంధించి ఆయా దేశాలతో IRGC నేరుగా అధికారిక చర్చలు జరుపుతుందని తెలిపింది. తమ పర్మిషన్ లేకుండా ఏ నౌక కూడా జలసంధిని దాటేందుకు వీల్లేదని కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. 

Also Read: అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు.. ఓటింగ్ శాతం ఎంతంటే ?

ఈ ఆంక్షల వెనుక ఇరాన్ తన ఆర్థిక ప్రయోజనాలను కూడా లింక్ చేసింది. యుద్ధం వల్ల వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను ఈ రెండు వారాల కాల్పుల విరమణ గడువులోగా తమకు అప్పగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. తమ ఆస్తుల విడుదలకు, హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు ముడిపెడుతూ ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.  మొత్తానికి తాత్కాలికంగా కాల్పుల విరమణ కుదిరినా కూడా చమురు రవాణా, ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు