Pakistan : అమెరికా ముందు పాక్ ను అడ్డంగా ఇరికించిన చైనా.. భలే దెబ్బ కొట్టిందిగా!

అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా విసిరిన ఒకే ఒక్క శాటిలైట్ చిత్రం ఇప్పుడు అమెరికా నుండి పాకిస్తాన్ వరకు పెను సంచలనం రేపుతోంది. పాకిస్తాన్‌లోని 'నూర్ ఖాన్' ఎయిర్‌బేస్‌లో నిలిపి ఉంచిన ఒక విమానం చిత్రం ఇప్పుడు అమెరికా నిఘా వర్గాల నిద్ర చెడగొడుతోంది.

New Update
FotoJet - 2026-05-13T130214.352

china-pak-us

Pakistan : అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా విసిరిన ఒకే ఒక్క శాటిలైట్ చిత్రం ఇప్పుడు అమెరికా నుండి పాకిస్తాన్ వరకు పెను సంచలనం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు సరిగ్గా కొన్ని గంటల ముందు.. చైనాకు చెందిన ఒక ప్రైవేట్ శాటిలైట్ సంస్థ పాకిస్తాన్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన సైనిక రహస్యాన్ని బహిర్గతం చేసింది. పాకిస్తాన్‌లోని 'నూర్ ఖాన్' ఎయిర్‌బేస్‌లో నిలిపి ఉంచిన ఒక విమానం చిత్రం ఇప్పుడు అమెరికా నిఘా వర్గాల నిద్ర చెడగొడుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెప్పుకునే పాకిస్తాన్, తెరవెనుక ఎంతటి ప్రమాదకరమైన ఆట ఆడుతుందో ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలిసింది.

సీ-130 హెర్క్యులస్ విమానం.. ఆ రంగు వెనుక రహస్యం ఏంటి?

చైనాకు చెందిన ‘మిజార్‌విజన్’ (MizarVision) అనే కమర్షియల్ శాటిలైట్ ఇమేజింగ్ సంస్థ గత నెల (ఏప్రిల్) లో తీసిన కొన్ని రక్షణ రంగానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. ఇందులో పాకిస్తాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ చిత్రం కూడా ఉంది. ఈ ఎయిర్‌బేస్‌లో ఒక 'C-130 హెర్క్యులస్' (C-130 Hercules) రవాణా విమానం నిలిపి ఉంచారు. అయితే, డిఫెన్స్ నిపుణుల ప్రకారం.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ సాధారణంగా తమ విమానాలకు 'గ్రే' లేదా 'స్లేటీ' రంగులను ఉపయోగిస్తుంది. కానీ, శాటిలైట్‌లో కనిపించిన విమానంపై ఎడారి ప్రాంతాల్లో ఉపయోగించే ‘స్యాండ్ కామౌఫ్లాజ్’ (ఇసుక రంగు) పెయింట్ ఉంది.

ఇరాన్ ఎయిర్‌ఫోర్స్ (IRIAF) తమ సీ-130 విమానాలకు ఖచ్చితంగా ఇదే కలర్ ప్యాటర్న్‌ను ఉపయోగిస్తుంది. దీంతో ఆ ఎయిర్‌బేస్‌లో ఉన్నది పాకిస్తాన్ విమానం కాదు, అది ఇరాన్ సైన్యానికి చెందిన విమానమనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రపంచ దేశాల కళ్లు గప్పి పాకిస్తాన్ తన సైనిక స్థావరాలలో ఇరాన్ యుద్ధ విమానాలకు 'సేఫ్ ప్లేస్' (సురక్షిత ప్రాంతం) కల్పిస్తోందని గతంలో అమెరికన్ మీడియా చేసిన ఆరోపణలకు ఈ చిత్రం ఇప్పుడు బలమైన సాక్ష్యంగా నిలిచింది.

ట్రంప్ చైనా పర్యటన.. వ్యూహాత్మక టైమింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 13 నుండి 15 వరకు మూడు రోజుల పాటు చైనాలో పర్యటించి, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ కీలక సదస్సుకు కొన్ని గంటల ముందే చైనా ఈ ఫోటోలను విడుదల చేయడం వెనుక పెద్ద అంతర్జాతీయ వ్యూహం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికాకు పరమ శత్రువైన ఇరాన్‌కు పాకిస్తాన్ ఎలా సహాయం చేస్తుందో చూపించి, ట్రంప్ పర్యటనలో చైనా మైలేజ్ సాధించాలని చూస్తోంది. తద్వారా ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవాలని చూస్తోంది. ఈ ప్రాంతంలో జరిగే ప్రతి చిన్న కదలికపై చైనాకు ఎంతటి పట్టు ఉందో, ఏదీ తమ కంటికి దూరం కాదనే బలమైన సందేశాన్ని అమెరికా, పాకిస్తాన్‌లకు చైనా పంపినట్లయింది.

పాకిస్తాన్‌కు 'ఇటు బావి.. అటు గొయ్యి'

చైనా చేసిన ఈ పనితో పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఒకవైపు చైనాను ఏమీ అనలేని పరిస్థితి, మరోవైపు అమెరికా ఆగ్రహానికి గురికావాల్సిన దుస్థితి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా అమెరికా ఇచ్చే ఆర్థిక సాయం, సైనిక నిధులు మరియు ఐఎంఎఫ్ (IMF) రుణాలపైనే ఆధారపడి నడుస్తోంది. ఇప్పుడు ఇరాన్ విమానాలకు రక్షణ కల్పిస్తూ దొరికిపోవడంతో అమెరికా పాకిస్తాన్‌పై తీవ్రంగా మండిపడే అవకాశం ఉంది. అదే జరిగితే పాకిస్తాన్‌కు అందే భారీ ఆర్థిక, సైనిక సాయ నిలిచిపోయి ఆ దేశం మరింత దివాళా తీసే ప్రమాదం ఉంది. తన స్వప్రయోజనాల కోసం చైనా, తన మిత్రదేశమైన పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఎలా బలిపెట్టిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు