/rtv/media/media_files/2026/04/20/iran-rejects-taking-part-in-2nd-round-of-peace-talks-with-us-2026-04-20-16-48-28.jpg)
Iran rejects taking part in 2nd round of peace talks with US
ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి అక్కడ ఇరుదేశాల మధ్య చర్చలు ఉంటాయనే వార్తలు వచ్చాయి. అయితే ఈ రెండో రౌండ్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ఇర్నా (IRNA) వెల్లడించింది. అమెరికా విధిస్తున్న మితమీరిన డిమాండ్లు, అవాస్తవిక అంచనాలు, మాటిమాటికీ మారుస్తున్న వైఖరి వల్లే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
చర్చలకు సంబంధించి అమెరికా రిలీజ్ చేస్తున్న నివేదికలు కేవలం ఇరాన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ఆడుతున్న 'మీడియా గేమ్' అంటూ కొట్టిపారేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇటీవల ట్రంప్ కూడా రెండోసారి శాంతి చర్చలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఇలాంటి సమయంలో ఇరాన్ చర్టల్లో పాల్గొనేందుకు నిరాకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: బాబ్బాబు.. అమెరికాను డబ్బులు అడుక్కుంటున్న పాక్.. మధ్యవర్తిత్వానికి అద్దె !
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఏప్రిల్ 8న అమెరికా-ఇరాన్ మధ్య రెండువారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత అమెరికా హర్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను దిగ్భందించిది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ ఆరోపిస్తుంది. ఓవైపు తమపై ఆంక్షలు విధిస్తూ.. మరోవైపు చర్చలకు పిలవడం సరైంది కాదని భావిస్తోంది. అందుకే అమెరికాతో చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏప్రిల్ 22న కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ గడువు ముగిసేలోగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరగాలని ట్రంప్ యంత్రాగం భావించింది. కానీ తాజాగా ఇరాన్ ఈ చర్చల్లో తాము పాల్గొనడం లేదని చెప్పడం కలకలం రేపుతోంది. మరి కాల్పుల విరమణ ఒప్పందం ముగిశాక మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ముదిరే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: జమ్మూ-కశ్మీర్‌లో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
Follow Us