/rtv/media/media_files/2026/02/25/iran-nears-deal-to-buy-supersonic-anti-ship-missiles-from-china-2026-02-25-20-48-19.jpg)
Iran nears deal to buy supersonic anti-ship missiles from China
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్, చైనా మధ్య ఓ కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. చైనా నుంచి ఇరాన్ అధునాతన CM-302 సూపర్సోనిక్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఇటీవల ట్రంప్ అణుఒప్పందం విషయంలో రాజీకి రావాలని ఇరాన్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ తీరానికి సమీపంలో యుద్ధ నౌకలను కూడా మోహరించింది.
చైనాకు చెందిన CM302 క్షిపణుల కొనుగోలు ఒప్పందం కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఇవి ఎప్పుడు డెలివరీ అవుతాయనేదానిపై క్లారిటీ లేదు. ఈ క్షిపణులు దాదాపు 290 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. ఇవి ఇరాన్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు చైనాతో రెండేళ్ల క్రితమే చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ గతేడాది జూన్‌లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధం తర్వాత ఇవి మరింత వేగవంతమయ్యాయి. అయితే ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎన్ని క్షిపణులు కొనుగోలు చేయనుంది, ఎంత చెల్లించనుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
Also Read: ప్రధాని మోదీ ఇజ్రాయిల్ పర్యటన కీలకం.. ప్రపంచ దేశాలతో కొత్త ఇండియా కూటమి!
చైనా-ఇరాన్ మధ్య కుదురుతున్న ఈ సైనిక ఒప్పందం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. చైనా కేవలం మిసైల్స్ కాకుండా, డ్రోన్ టెక్నాలజీ, యాంటీ-శాటిలైట్ ఆయుధాలను కూడా ఇరాన్‌కు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చైనా, ఇరాన్, రష్యా ఏటా ఉమ్మడి నావికా విన్యాసాలు నిర్వహిస్తాయి. గతేడాది ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు దాని క్షిపణి కార్యక్రమం కోసం రసాయన పదార్థాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ పలు చైనా కంపెనీలపై ఆంక్షలు విధించింది. అయితే చైనా ఈ ఆరోపణలను ఖండించింది. ఎగుమతి నియంత్రణలను కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
అమెరికా బెదిరింపులకు, ఒత్తిడికి తలొగ్గకుండా ఉండాలంటే ఇరాన్‌కు చైనా సపోర్ట్ తప్పనిసరి. అందుకే మిడిల్ ఈస్ట్‌లో అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి చైనా ఇరాన్‌ను ఒక పావులా వాడుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us