BREAKING: యుద్ధంలో బిగ్‌ట్విస్ట్.. కాల్పుల విరమణ వైపు ఇరాన్‌, అమెరికా..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది.

New Update
Iran and US receive proposal for 45 day ceasefire and reopening of Strait of Hormuz

Iran and US receive proposal for 45 day ceasefire and reopening of Strait of Hormuz

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా.. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు దేశాలు.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.

Also Read: అమెరికాలో 'బర్త్ రైట్' పౌరసత్వానికి బ్రేక్? భారతీయ టెక్కీల్లో మొదలైన వణుకు!

ఈ మూడు దేశాలు కలిసి ఓ ముసాయిదా ప్లాన్‌ను అమెరికా-ఇరాన్‌కు అందించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్లాన్‌లో 45 రోజుల పాటు కాల్పుల విరమణ, హర్మూజ్‌ జలసంధిని తెరవడం లాంటి అంశాలను ప్రస్తావించారు. ఈ 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిపేందుకు ఛాన్స్ లభిస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముసాయిదాను అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.  

Also Read: పాకిస్థాన్‌లో ఎంపాక్స్ కలకలం : ఏడుగురు శిశువుల మృతి!

ఇదిలాఉండగా సోమవారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. మరోవైపు ఇరాన్‌కు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా సంచలన హెచ్చరిక చేశారు. హర్మూజ్‌ జలసంధిని గడువులోగా తెరవకపోతే ఇరాన్‌లో విద్యుత్ కర్మాగారాలు, వంతెనలకు ధ్వంసం చేసి నరకం చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 7, మంగళవారం రాత్రి 8 గంటల ఈ గడువు ముగియనుంది. మరి అమెరికా-ఇరాన్ మధ్య ఇంకా భీకర కాల్పులు జరుగుతాయా ? లేదా కాల్పుల విరమణ జరుగుతుందా అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు