/rtv/media/media_files/2025/04/07/NSZpGWGb4vu1duR10CqL.jpg)
Iphone parcel Photograph: (Iphone parcel)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ కంపెనీ ఐఫోన్లను అమెరికాకు చేరవేసింది. భారత్, చైనాలలో తయారైన ఐఫోన్లను కేవలం మూడు రోజుల్లో 5 విమానాలతో అమెరికాకు ఎగుమతి చేసినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
#Apple shipped five planes of #iPhones and other goods from #India to the #US in March to dodge new 10% tariffs.
— The Times Of India (@timesofindia) April 7, 2025
The move, meant to maintain prices and manage supply chain impacts, highlights India's growing role in Apple's manufacturing due to better #tariff rates compared to… pic.twitter.com/rtZAiIgfSw
ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి
ప్రతీకారం సుంకాలు అమలులోకి వస్తాయని..
ఇండియా నుంచి మూడు విమానాలు, చైనా నుంచి రెండు విమానాలు నిండుగా ఐఫోన్లు అమెరికా చేరాయని తెలిపారు. అయితే ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయని ప్రకటన రావడంతో.. యాపిల్ సంస్థ మార్చి నెలాఖరులో ఈ నిర్ణయం తీసుకుంది. పన్నును తగ్గించుకోవడానికి యాపిల్ సంస్థ భారత్, చైనాలో తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లను అమెరికాకు చేరవేసింది.
ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
వీటివల్ల కొన్ని రోజుల పాటు ఐఫోన్ ధరలు స్థిరంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రంప్ టారిఫ్‌లు పెంచినప్పుడు కూడా ఐఫోన్ల ధరలు పెంచే ఆలోచన లేదని యాపిల్ కంపెనీ తెలిపిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త