Michael Savage : అమెరికా రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా పెను దుమారం రేపింది.
అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ ఒక పాడ్‌కాస్ట్‌లో భారత్, చైనా వంటి దేశాలను ‘నరకాలు’గా అభివర్ణించడమే కాకుండా, అక్కడి నుంచి వచ్చే వలసదారులను ‘గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టాప్స్’ అని కించపరిచారు. భారతీయులు, చైనీయులు అమెరికాకు చేసిన నష్టం మాఫియా కంటే ఎక్కువని, వారు అమెరికన్లను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, అమెరికాలో పుట్టే బిడ్డలకు పౌరసత్వం లభించే 'బర్త్‌రైట్ సిటిజన్‌షిప్' చట్టాన్ని వాడుకుని, కుటుంబాల మొత్తాన్ని అమెరికాకు తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వివాదాస్పద వీడియోను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో రీపోస్ట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.
గతంలో భారత్‌కు మద్దతుదారుడినని చెప్పుకున్న శావేజ్, ప్రస్తుతం తన అభిప్రాయం మారిందని పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలన్నీ భారతీయులు, చైనీయుల గుప్పిట్లో ఉన్నాయని, అక్కడ శ్వేతజాతీయులకు ఉద్యోగాలు దక్కడం లేదని ఆరోపించారు. అమెరికా రాజ్యాంగం రాసిన కాలంలో విమానాలు, ఇంటర్నెట్ లేవని, మారుతున్న కాలానికి అనుగుణంగా పౌరసత్వ చట్టాలను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై కోర్టుల కంటే కూడా జాతీయ స్థాయిలో రెఫరెండం నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇవి అజ్ఞానంతో కూడుకున్నవి, అనుచితమైనవి,జుగుప్సాకరమైనవని భారత్ మండిపడింది. ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవ సంబంధాలను ప్రతిబింబించవని, భారత్- అమెరికా బంధం పరస్పర గౌరవంపై ఆధారపడి ఉందని గుర్తుచేసింది. అటు హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కూడా ఈ ఉదంతాన్ని ఖండించింది. భారత్, చైనాలకు వేల ఏళ్ల నాగరికత ఉందని గుర్తు చేస్తూ, ట్రంప్‌ను ఒక యుద్ధ నేరగాడిగా, జాత్యహంకారిగా అభివర్ణించింది.
విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా అధికారిక వర్గాలు అప్రమత్తమయ్యాయి. ట్రంప్ గతంలో భారత్‌ను గొప్ప దేశంగా కొనియాడారని గుర్తు చేస్తూ, భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధులు నష్టనివారణ చర్యలకు దిగారు. అయితే, అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్ ఇటువంటి జాత్యహంకార వ్యాఖ్యలను ప్రోత్సహించడం, ప్రవాస భారతీయులలో మరియు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన వలస విధానాలపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది.
ఇండియన్స్, చైనీయులు ‘గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టాప్స్’.... మైఖేల్ శావేజ్ జాత్యహంకార వ్యాఖ్యలు
అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ భారత్, చైనాలను ‘నరకాలు’గా అభివర్ణించడమే కాకుండా, ఆ దేశాల వలసదారులను ‘గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టాప్స్’ అని కించపరిచారు. ఆ వ్యాఖ్యలను డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా పెను దుమారం రేపింది.
Trump