పరువు తీసేశారు.. విదేశీ హోటల్‌లో వస్తువులు దొంగిలిస్తూ పట్టుబడ్డ భారతీయులు

ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఓ రిసార్టులో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగిలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు.

New Update
Indian tourists caught stealing hotel items in Bali

Indian tourists caught stealing hotel items in Bali

ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఓ రిసార్టులో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగిలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గియాన్యర్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో నలుగురు భారతీయులు రెండు మూడు రోజులు బస చేశారు. ఏప్రిల్ 19న గదులు ఖాళీ చేసేటప్పుడు ఆ హోటల్‌కు చెందిన వస్తువులను తమ బ్యాగుల్లో వేసుకున్నారు. వాళ్లు బయటకి వెళ్తుండగా గదులను తనిఖీ చేసిన సిబ్బందికి కొన్ని వస్తువులు కనిపించలేవు. దీంతో అనుమానం వచ్చి వాళ్ల బ్యాగులను తనిఖీ చేశారు. 

Also Read: పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..

 అందులో హోటల్‌కు చెందిన హెయిర్‌ డ్రైయర్‌, టవల్స్‌, డోర్‌ మ్యాట్‌, టీవీ రిమోట్‌, అలాగే డైనింగ్‌కు సంబంధించిన పలు వస్తువులు బయటపడ్డాయి. వాళ్లు బస చేసిన గదిలోని వస్తువులను ఇలా దొంగిలించడం చూసి హోటల్ సిబ్బంది కంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశాల్లో ఇలాంటి వారు భారతీయుల పరువు తీస్తున్నారంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. 

Also Read: ‘వెస్టర్న్‌ స్టైల్‌ సర్‌ప్రైజ్‌..’  అంటూ ప్రియుడి కళ్లకు గంతలు..ఆ తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించి...

ఈ దొంగతన వ్యవహారంపై హోటల్ యాజమాన్యం పెద్దమనసుతో ఆలోచించింది. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. జరిగిన విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపింది. గదిలో దొంగిలించిన వస్తువులను పర్యాటకులు తిరిగి ఇచ్చేశారు. దీంతో యాజమాన్యం వాళ్లని బయటికి వెళ్లనిచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవల అమెరికాలో కూడా ఓ మాల్‌లో ఓ భారతీయ మహిళ వస్తువులు దొంగతనం చేస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే.  

Advertisment
తాజా కథనాలు