/rtv/media/media_files/2025/03/15/AA6ejMngdKwjpc8kGQc9.jpg)
Indian Student Rajani Srinivasan
గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్ల వెంటనే ఖాళీ చేయాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు మండిపడుతున్నారు. దీనికి అమెరికాతో పాటూ పలు దేశాల్లో పాలస్తీనియన్లు నిరసనలు చేస్తున్నారు. గాజాను తన ఆస్తిగా భావిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.. అందుకే తనకు నచ్చినవిధంగా గాజాను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఆ దేశస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కాట్లాండ్ లో ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్‌లలో ఒకదానిని ధ్వంసం చేశామని పాలస్తీనా అనుకూల కార్యకర్తలు ప్రకటించారు కూడా. ఇక దానితో పాటూ అమెరికాలో పలు యూనివర్శిటీల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: USA: ఏలియన్స్ ఉన్నాయి..అమెరికా నిఘా అధికారులు
భారతీయ విద్యార్థిని..
తాజాగా పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీనికి భారతదేశానికి చెందిన రంజనీ శ్రీనివాసన్ అనే విద్యార్థిని మద్దతు పలికారు. దీని కారణంగా ఈమె ఎఫ్ -1 వీసాను రద్దు చేశారు. అంతేకాదు ఆమె స్వీయ బహిష్కరణకు గురైయ్యారని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. సీబీపీ హోమ్ అనే ఆప్‌ను ఉపయోగించి ఆమె మార్చి 11న స్వీయ బహిష్కరణకు గురైనట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. అమెరికాలో నిసించడానికి, చదువుకోడానికి తాము వీసా ఇస్తామని...కానీ ఉగ్రవాద సంస్థలకు మద్దుతు తెలిపినా, నిరసనలు చేసినా...వీసాలను రద్దు చేస్తామని డీహెచ్ఎస్ చెప్పింది. అలాంట వారు తమ దేశంలో ఉండకూడదని కామెంట్ చేసింది. మిలిటెంట్ సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపిన కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని ఒకరు స్వీయ బహిష్కరణ కోసం సీబీపీ హోమ్ ఆప్ ఉపయోగించిందనందుకు సంతోషిస్తున్నా అని డీహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ అన్నారు. ఇందులో టూల్ ను ఉయోగించి స్వచ్ఛందంగా దేశాన్ని దిలిపెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఆమె తెలిపారు.
Also Read: Cricket: బెదిరింపు కాల్స్ వచ్చేవి..టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్