/rtv/media/media_files/2025/01/16/Vym52IK6HLfOWojFibcj.jpg)
H!-B Visa
మరో నాలుగు రోజుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్ రాక అమెరికన్లను ఎలా ప్రభావితం చేస్తోందో తెలియదు కానీ అక్కడి ఇండియన్లలో మాత్రం దడ మొదలైంది. ముఖ్యంగా హెచ్1–బీ వీసాదారుల్లో. ఎన్నిక ప్రచారం దగ్గర నుంచి ఇమ్మిగ్రేషన్ లో మార్పు తీసుకువస్తానని...వలసలను అరికడతాను లేదా తగ్గిస్తానని చెబుతున్నారు ట్రంప్. అందుకు అనుగుణంగానే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే ఇమ్మిగ్రేషన్‌లో మార్పులు తీసుకురానున్నారని తెలుస్తోంది. దానికి తోడు ట్రంప్ డిప్యూటీ చీఫ్ టాఫ్‌గా మిల్లర్ ను నియమించారు. ఇతను కూడా ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పలు అవసరమని చెప్పారు. దీంతో వీసాదారులపై పరిమితులు పెరుగుతాయని చెబుతున్నారు.
ఆలోపు వచ్చేయండి..
నేపథ్యంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం లోపు ఇండియా వెళ్ళిన హెచ్1 –బి వీసాదారులను తిరిగి వచ్చేయాలని ఆయా కంపెనీలు కోరుతున్నాయిన సమాచారం. ట్రంప్ వస్తే ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో మార్పులు రావచ్చని చెబుతున్నారు. అలా జరిగితే మళ్ళీ అమెరికా తిరిగి రాలేరేమో అని కంపెనీల ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. అందుకే ఎందుకొచ్చిన రిస్క్...ట్రంప్ ప్రమా స్వీకారం లోప అమెరికా వచ్చేండి అని సలహా ఇస్తున్నారు.
Also Read: Russia: పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి..
రిమోట్ వర్క్‌పై మొగ్గు చూపుతున్న కంపెనీలు...
మరోవైపు అమెరికాలో ఇప్పుడు చాలా కంపెనీలు రిమోట్ వర్క్ మీద ఇంట్రస్ట్ చూపుతున్నాయట. తమ దగ్గర ఉద్యోగానికి వస్తున్న వారిని అమెరికా రమ్మనం లేదని తెలుస్తోంది. దానికి బదులు అదే జీతం, అవే రూల్స్‌తో రిమోట్ వర్క్ చేయాలని కోరుతున్నాయని చెబుతున్నారు. దీనికి కారణం ట్రంప్ వచ్చాక వీసా రూల్స్ మారుతాయని...దాని వల ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అవన్నీ ఎందుకు రిస్క్ తీసుకోవడం...హాయిగా రిమోట్ వర్క్ చేస్తే సరిపోతుంది కదా అంటున్నాయిట కంపెనీలు. మరోవైపు ఈసారి హెచ్1–బీ వీసాల లాటరీ ఇంతకు ముందు అంత తీయకపోవచ్చని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి 85 వేల వీసాలను అనుమతి ఇస్తోంది. కానీ ట్రంప్ వచ్చాక ఇన్ని ఇవ్వకపోవచ్చని అంటున్నారు.
Also Read: AP: ఓ పక్కన నిలబడి కోట్లు కొల్లగొట్టిన పందెం కోడి