BIG BREAKING: భారతీయులపై ఇరాన్‌ దాడులు..

కీలక చమరు మార్గమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ ట్యాంకర్‌ను టార్గెట్‌ చేసి దాడులు చేసింది. అందులో భారతీయులు ఉండటం కలకలం రేపుతోంది.

New Update
Indian-crewed tanker hit off Oman coast amid fresh Israel-Iran strikes, 4 injured

Indian-crewed tanker hit off Oman coast amid fresh Israel-Iran strikes, 4 injured

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కీలక చమరు మార్గమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ ట్యాంకర్‌ను టార్గెట్‌ చేసి దాడులు చేసింది. అందులో భారతీయులు ఉండటం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఒమన్‌లోని ముసాండమ్ ద్వీపకల్పం వద్ద ఖసాబ్‌ పోర్టు వద్ద పలావు దేశ పతాకంతో వస్తున్న చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు చేసింది. 

Also Read: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ టార్గెట్‌...బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌

ఈ దాడి చేసిన సమయంలో ఆ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 15 మంది భారతీయులే ఉన్నారు. మిగిలిన అయిదుగురు ఇరాన్ జాతీయులే. వీళ్లలో నలుగురు గాయపడ్డట్లు ఒమన్ తెలిపింది.  ఇదిలాఉండగా ఉండగా హర్మూజ్ జలసంధి అనేది అరేబియా సముద్రంలోని ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉంది. ఈ జలసంధి కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ రూట్ నుంచి ప్రతిరోజూ 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళ్తుంది. ప్రపంచ చమురు వినియోగంలో 20 శాతం ఇక్కడి నుంచే వెళ్తుంది. సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఈ మార్గం ద్వారా చమురు ఎగుమతి అవుతోంది. 

Also Read: అలీ ఖమేనీ మృతి.. హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలో నిరసనలు

భారత్‌పై తీవ్ర ప్రభావం

భారత్‌ దిగుమతి చేసుకునే చమురులో దాదాపు సగం ఈ హర్మూజ్ జలసంధి మార్గం నుంచే రావాల్సి ఉంటుంది. ప్రతిరోజూ 55 లక్షల పీపాల చమురును మనం ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇది భారత చమురులో 40 శాతానికి సమానం. గత రెండు నెలల్లో ఇది 50 శాతానికి పెరిగింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.

Advertisment
తాజా కథనాలు