Petrol-Diesel: వాహనదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చాలా దేశాల్లో ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది.

New Update
India cuts special excise duties on petrol, diesel

India cuts special excise duties on petrol, diesel

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చాలా దేశాల్లో ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌(petrol-diesel) పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ(Excise Duty) ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించగా.. డీజిల్‌పై ఉన్న రూ.10ను పూర్తిగా తొలగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 107 ఉండగా.. రూ.97కు చేరనుంది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ.95 ఉండగా రూ.85కు తగ్గనుంది. 

Also Read: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్

India Cuts Special Excise Duties

ఇరాన్‌తో యుద్ధం(iran war) కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి వద్ద అంతరాయం నెలకొంది. చమురు, గ్యాస్ సరఫరాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ ధరలపై సంక్షోభం నెలకొంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం వాహనదారులకు ఊరట కల్పించేలా ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది.  

Also Read: ట్రంప్ సంచలన ప్రకటన.. ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా

మరోవైపు దేశంలో పెట్రోల్, డిజీల్ కొరతపై భయాందోళన మొదలైంది. పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూలు కడుతున్నారు. దేశంలో ఇంధన కొరత లేదని..ఎలాంటి భయాందోళన అవసరం లేదని తెలిపింది. 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్‌ ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో ఇంధన కొరతపై అసత్య ప్రచారం జరుగుతండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. 

Advertisment
తాజా కథనాలు