హర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు చేరిన నౌక.. ఎలా వచ్చిందో తెలుసా ?

హర్ముజ్‌ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.

New Update
India-Bound Oil Tanker's Daring Dash Through Strait Of Hormuz

India-Bound Oil Tanker's Daring Dash Through Strait Of Hormuz

పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్‌ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. అమెరికా మిత్ర దేశాలకు సంబంధించిన నౌకలు ఈ మార్గంలో వస్తే దాడులు కూడా చేస్తోంది. అయితే హర్ముజ్‌ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది. సౌదీ అరేబియాలోని రాస్‌ తనురా షిప్‌యార్డ్‌ నుంచి బయలుదేరిన ఈ నౌక.. భారత్‌లో 1,35,335 మెట్రిక్ టన్నుల క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసింది.

Also Read: యుద్ధం ఆగుతుందా ? అమెరికా, ఇరాన్ పెట్టిన షరతులు ఇవే

నౌక హర్ముజ్ జలసంధి ఎలా దాటింది ? 

ఆ నౌకలో భారతీయ కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు సహా భారత్‌, పాక్‌, ఫిలిప్పీన్స్‌కు చెందిన 29 మంది సిబ్బంది ఉన్నారు.  ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఖమేనీ మరణంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మార్చి 1న  భారతీయ కెప్టెన్‌ సుక్షాంత్ సింగ్ సంధు నేతృత్వంలో లైబీరియా ఆయిల్‌ ట్యాంకర్‌ బయలుదేరింది. సౌదీ అరేబియాలోని రాస్‌ తనూరా షిప్‌యార్డ్‌ నుంచి బయలుదేరగా మార్చి 8 నాటికి హర్ముజ్ జలసంధికి చేరుకుంది. 

ఈ ట్యాంకర్ మార్చి 8న చివరిసారిగా అక్కడ ఉన్నట్లు సముద్ర ట్రాకింగ్ డేటాలో కనిపించింది. ఆ తర్వాత ఈ ట్యాంకర్ అక్కడ కనిపించలేదు. ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ రూట్‌ నుంచి వచ్చే నౌకలపై దాడులు చేయడం ప్రారంభించింది. ఈ సమయంలోనే ఆ ఆయిల్‌ ట్యాంకర్‌ 'గోయింగ్‌ డార్క్‌' అనే వ్యూహాన్ని అనుసరించింది. షిప్‌లో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS), అలాగే ట్రాన్స్‌పాండర్స్‌ స్విచ్‌లను ఆఫ్ చేశారు. రెండ్రోజులుగా రాత్రిపూట అప్రమత్తంగా హర్ముజ్ జలసంధిని దాటింది. ఆ తర్వాత భారత సముద్ర జలాల్లోకి వచ్చింది.  

Also Read: దేశంలో LPG కొరత.. కేంద్రం సంచలన ప్రకటన

ఏఐఎస్, ట్రాన్స్‌పాండర్‌ స్విచ్‌లను మళ్లీ ఆన్‌ చేయగా సముద్ర ట్రాకింగ్ సిస్టమ్‌లో ఈ ఆయిల్‌ ట్యాంకర్ కనిపించింది. అయితే ఈ ట్యాంకర్ హర్ముజ్‌ను సురక్షితంగా దాటేందుకు ఇరాన్‌తో భారత దౌత్య సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు, ట్రాకింగ్‌ను నివారించేందుకు నౌకలు గోయింగ్ డార్క్‌ వ్యూహాన్ని పాటిస్తాయి. అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వ్యూహాన్ని అమలుచేస్తాయి.

Advertisment
తాజా కథనాలు