USA: రష్యా పైనా ఆంక్షలు తప్పవంటున్న ట్రంప్

ఎవరూ మాకు ఎక్కవు కాదు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మిత్రదేశాలైనా సుంకాల విధింపు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యాపై కూడా భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. 

New Update
Donald Trump

Donald Trump

ఉక్రెయిన్ మీద దాడులు ఆపకపోతే రష్యాకు కూడా భారీ సుంకాలు, ఆంక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు అమెరికా     అధ్యక్షుడు ట్రంప్. రష్యాపై భారీ స్థాయిలో బ్యాంకింగ్‌ ఆంక్షలు, సాధారణ ఆంక్షలు, సుంకాలు విధింపు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతిపై ఒప్పందం చేసుకునే వరకు వీటిని కొనసాగిస్తామని అన్నారు. తాము చర్యలు తీసుకోక ముందే రష్యా, ఉక్రెయిన్ లు చర్చలకు సిద్ధం కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. 

శాంతి ఒప్పందం చేసుకుని తీరాల్సిందే..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి చెబుతున్నారు. పదవి బాధ్యతలు చేపట్టాక కూడా అదే మాట మీద నిలబడ్డారు. అప్పటి నుంచి ఇరు దేశాల అధ్యక్షులతో చర్చలు జరుపుతున్నారు కూడా. కానీ మధ్యలో చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం రష్యా, ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందం మాత్రం జరిగి తీరాల్సిందే అంటున్నారు. అందుకోసం ఏమైనా చేస్తా అని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పుతిన్‌ యుద్ధం ముగించకుంటే భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు ఉంటాయని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత పగలు మర్చిపోదామంటూ ఇరాన్‌కు లేఖ రాశారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీకి ఈ లేఖను పంపించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. శుక్రవారం ఫాక్స్‌ బిజినెస్‌ నెట్‌వర్క్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం ఇరాన్‌కు లేఖ పంపించినట్లు తెలిపారు. వాళ్లు చర్చిస్తారని మేము ఆశిస్తున్నామని.. ఇది ఇరాన్‌కు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తోందని చెప్పారు. 

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

 

Advertisment
Advertisment
Advertisment