Elon Musk : తొలి ట్రిలియనీర్‌ గా మస్క్‌..ఆ రేసులో అదానీ కూడా!

ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నీర్‌గా స్పేస్ ఎక్స్‌, టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌ నిలవబోతున్నారు. 2027 నాటికి ఆయ‌న ట్రిలియ‌న్ డాల‌ర్లు క‌లిగిన వ్య‌క్తిగా చరిత్ర సృష్టించబోతున్నట్లు ఇన్‌ఫార్మా క‌నెక్ట్ అకాడ‌మీ పేర్కొంది.ట్రిలియ‌నీర్ క్ల‌బ్‌లో కూడా చేరనున్నారు.

author-image
By Bhavana
New Update
musk

స్పేస్ ఎక్స్‌, టెస్లా కంపెనీ సీఈవో ఎల‌న్ మ‌స్క్‌.. ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నీర్‌గా నిలవబోతున్నట్లు తెలుస్తుంది.. 2027 నాటికి ఆయ‌న ట్రిలియ‌న్ డాల‌ర్లు క‌లిగిన వ్య‌క్తిగా చరిత్ర సృష్టించబోతున్నట్లు ఇన్‌ఫార్మా క‌నెక్ట్ అకాడ‌మీ పేర్కొంది. ప్ర‌తి ఏడాది మ‌స్క్ ఆదాయం పెరుగుతున్న గ‌ణాంకాల ఆధారంగా ఈ అంచ‌నా వేసినట్లు తెలుస్తుంది. 

మ‌స్క్ వార్షిక సంప‌ద వృద్ధి సుమారు 109.88గా ఉన్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు. సోష‌ల్ మీడియా ఎక్స్ ఓన‌ర్ అయిన మ‌స్క్‌.. ప్ర‌స్తుతం 237 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న వ్య‌క్తిగా మొద‌టి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌స్క్ .. ఆరు కంపెనీల‌కు ఫౌండ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ కూడా ఇందులో ఉన్నాయి. టెస్లా కంపెనీ మార్కెట్ విలువ 669.28 బిలియ‌న్ డాల‌ర్లుగా అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఆ కంపెనీ విలువ వ‌చ్చే ఏడాది ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌పంచ సంప‌న్నుల్లో ట్రిలియ‌నీర్లు కాబోయే ఇత‌ర‌ వ్యాపార‌వేత్త‌ల‌ను కూడా అంచనా వేశారు. ట్రిలియ‌నీర్ క్ల‌బ్‌లో చేర‌నున్న వారిలో భార‌తీయ వ్యాపారి గౌత‌మ్ అదానీ కూడా ఉన్న‌ట్లు సమాచారం.

ఎల‌న్ మ‌స్క్ తొలి సారి ఫోర్బ్స్ బిలియ‌నీర్ల జాబితాలో 2012లో మెరిశారు. అప్పుడు ఆయ‌న ఆస్తి రెండు బిలియ‌న్ల డాల‌ర్లు. 2021లో తొలిసారి ఆయ‌న ప్ర‌పంచ కుబేరుల్లో బేజోస్‌ను వెన‌క్కి తోసి ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచాడు. 2022 డిసెంబ‌ర్‌లో ఆయ‌న కొన్నాళ్లు ఆ స్థానాన్ని కోల్పోయారు. మ‌ళ్లీ ఆర్నెళ్ల త‌ర్వాత ఫ‌స్ట్ ప్లేస్ కి వచ్చేశాడు.

Also Read: తెలంగాణకు మరో వందే భారత్‌…ఆ రూట్లో పరుగులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment