Iran: విదేశాల్లో స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తులు ఎంతో తెలుసా ?.. అమెరికా అదుపులో బిలియన్ల డాలర్లు సొమ్ము

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. ఈ చర్చల్లో భాగంగా ఇరాన్.. విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ప్రధాన షరతు పెట్టింది.

New Update
how much iran assets has seized by usa, know details

how much iran assets has seized by usa

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. ఈ చర్చల్లో భాగంగా ఇరాన్.. విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ప్రధాన షరతు పెట్టింది. కానీ ఇందుకు అమెరికా ఒప్పుకోలేదు. అయితే ఇరాన్ ఆస్తులు విదేశాల్లో ఎంత నిలిచిపోయాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఇరాన్ సంపదం ప్రస్తుతం అమెరికా ఆంక్షల వల్ల ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో నిలిచిపోయింది. సుమారు 100 నుంచి 120 బిలియన్ డాలర్లు (రూ.8-10 లక్షల కోట్లు) విలువైన ఇరాన్ సంపద విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇందులో ప్రధానంగా దక్షిణ కొరియాలో 7 బిలియన్ డాలర్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత జపాన్‌లో 1.5 బిలియన్ డాలర్లు, లక్సెంబర్గ్‌లో 1.6 బిలియన్ డాలర్లు నిలిచిపోయాయి. వాస్తవానికి ఇవి ఇరాన్ తమ చమురు అమ్మి సంపాదించిన నిధులే. కానీ అమెరికా ఒత్తిడి వల్ల ఆయా దేశాలు వీటిని ఇరాన్‌కు బదిలీ చేయలేకపోతున్నాయి. 

Also Read: రష్యా మాస్టర్ ప్లాన్.. ఇరాన్ అంగీకరిస్తే యుద్ధానికి బ్రేక్

ఎందుకు ఆస్తులను స్తంభింపజేశారు ? 

ఇరాన్ ఆస్తులను స్తంభింపజేయడం ఇప్పటిది కాదు. 1979లోనే ఇరాన్ విప్లవం, అమెరికా రాయబార కార్యాలయ బందీల సంక్షోభం వల్ల ఇది మొదలైంది. ఆ తర్వాత ఇరాన్‌పై అణు కార్యక్రమం, తీవ్రవాద ఆరోపణలు రావడంతో ఈ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. ముఖ్యంగా 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అణు ఒప్పందం నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నిధులు నిలిపివేయడం పతాక స్థాయికి చేరింది.

 కేవలం నగదు రూపంలోనే కాకుండా, న్యూయార్క్‌లో ఉన్న సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన ఓ ఎత్తైన భవనంతో పాటు అమెరికాలోని పలు నగరాల్లో ఇరాన్ ప్రభుత్వ స్థిరాస్తులను సైతం ట్రంప్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఇరాన్ సంస్థలకు చెందిన భూములు, భవనాలు , అద్దె ఆస్తులు, వీటన్నింటి విలువ సుమారు 50 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.

6 బిలియన్ డాలర్ల వివాదం

ఇటీవల ఖతార్‌తో పాటు ఇతర విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన 6 బిలియన్ డాలర్ల  ఇరాన్ నిధుల విడుదలపై పెద్ద చర్చ నడిచింది. మానవతా దృక్పథంతో ఈ నిధులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించింది. కానీ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత 2023లో వీటి విడుదలను మళ్లీ తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు ఈ నిధులను విడుదల చేయాలంటే హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని అమెరికా కండిషన్లు పెడుతోంది. అలాగే అణ్వాయుధ కార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఇరాన్ వీటికి ఒప్పుకున్నా కూడా ఈ డబ్బును నేరుగా ఇరాన్‌కు ఇవ్వరు. ఆహారం, మందులు లాంటి అత్యవసర అవసరాల కోసం మాత్రమే వాడేలా విడతల వారీగా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Also Read: ఇరాన్ చుట్టూ అమెరికా ఉచ్చు.. 15 యుద్ధనౌకలతో భారీ దిగ్బంధనం.. ట్రంప్ సీరియస్ వార్నింగ్!

మరోవైపు ఇరాన్ మాత్రం తమ ఆస్తులను విడుదల చేయడాన్ని ప్రాథమిక హక్కుగా భావిస్తోంది. తమ సొంత డబ్బులు కూడా పొందకుండా అమెరికా షరతులు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రష్యా లాంటి దేశాలు ఈ యుద్ధ సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నా కూడా అమెరికా విధిస్తున్న నిబంధనలకు ఇరాన్ లొంగడం లేదు. 

హర్మూజ్‌ జలసంధిని ఇటీవల ఇరాన్ తమ కంట్రోల్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి వెళ్లే నౌకలపై పన్ను కూడా విధిస్తోంది. ఫిబ్రవరి చివరలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. గతంలో రోజుకు 150 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో.. ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నౌకలు వెళ్తున్నాయి. మరోవైపు శాంతి చర్చలు ఫెయిల్ అవ్వడంతో ఇరాన్‌ ఓడరేవులు, తీర ప్రాంతాలను అమెరికా నౌకాదళం దిగ్బంధించింది. ఇరాన్‌ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ మొత్తం15కు పైగా యుద్ధనౌకలను మోహరించింది. ఈ చర్యల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింత పెరగడమే కాక.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు