Flight: ఎయిర్‌బస్‌ విమానాలకు సూర్యూడి ఎఫెక్ట్‌.. 6 వేల విమానాలకు అలెర్ట్

సాధారణంగా విమానాల్లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుంటాయి. దీనివల్ల వాటిని అత్యవసరంగా వేరే ప్రాంతాల్లో ల్యాండ్ చేయించడం, వెనక్కి మళ్లించడం లాంటివి చేస్తుంటారు. అయితే తాజాగా సూర్యుడి ఎఫెక్ట్‌ వేలాది విమానాలపై పడటం సంచలనం రేపుతోంది.

New Update
How intense solar radiation triggered Airbus A320 software fix and global flight disruptions

How intense solar radiation triggered Airbus A320 software fix and global flight disruptions

సాధారణంగా విమానాల్లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుంటాయి. దీనివల్ల వాటిని అత్యవసరంగా వేరే ప్రాంతాల్లో ల్యాండ్ చేయించడం, వెనక్కి మళ్లించడం లాంటివి చేస్తుంటారు. అయితే తాజాగా సూర్యుడి ఎఫెక్ట్‌ వేలాది విమానాలపై పడటం సంచలనం రేపుతోంది. సోలార్ రేడియేషన్ కారణంగా ఓ విమానంలో సాంకేతిక సమస్య రావడంతో వేలాది విమానాలపై ప్రతాపం చూపించింది. ఏకంగా 6 వేల విమానాలను అత్యవసరంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలని ఎయిర్‌బస్‌ ప్రకటన చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 30న మెక్సికోలో కాన్‌కన్‌ నుంచి నూయార్స్‌కు జెట్‌ బ్లూ ఏ320 అనే విమానం బయలుదేరింది. గాల్లో ఉండగానే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం ప్రయాణిస్తున్న ఎత్తు ఒక్కసారిగా వేల అడుగులు తగ్గిపోయింది. దీంతో అలెర్ట్ అయిన పైలట్లు వెంటనే  దారి మళ్లించారు. తంపాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.  ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేపట్టింది. అయితే  సోలార్ రేడియేషన్ వల్లే  ఎలివేటర్ అండ్ ఎలిరాన్ కంప్యూటర్‌ (ELAC) సిస్టమ్‌లో మార్పులు జరిగాయని అధికారులు గుర్తించారు. దీని ప్రభావం వల్లే సాంకేతిక సమస్య వచ్చనట్లు నిర్ధారించారు.   

Also Read: నిన్న లేఖ రాశాడు..ఈ రోజు లొంగిపోయాడు..ఎంఎంసీ జోన్‌ ప్రతినిధి అనంత్ సరెండర్‌

సూర్యుడు నుంచి వచ్చే శక్తివంతమైన కణాలు, విద్యుదయస్కాంత తరంగాల ప్రవాహాన్ని సోలార్ రేడియోషన్ అని అంటారు. అతినీలలోహిత కిరణాలు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు వంటి కణాల వల్ల రేడియేషన్‌ ఏర్పడుతుంది. ఇది విమానాల్లో కూడా సమస్యలకు కారణమవుతుంది. సూర్యుని కరోనా, విమానంలో ఉండే ఎలక్ట్రానిక్స్‌ ఘర్షణ చెందడంతో టెక్నికల్‌ వ్యవస్థలు దెబ్బతింటాయి. నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్‌ డేటా లాంటివి అదుపుతప్పుతాయి. దీంతో ఇది విమాన భద్రతకు ముప్పుగా మారుతుంది.    

అయితే అక్టోబర్ 30న జెట్‌ బ్లూ విమానం సోలార్ రేడియేషన్‌కు గురైంది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇలా జరిగినప్పుడు విమాన కంట్రోల్‌కు సంబంధించి కీలక సమాచారం లేకుండా పోయే ప్రమాదం ఉందని ఎయిర్‌బస్‌ గుర్తించింది. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్త కోసం దాదాపు 6 వేల ఏ320 విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ ముఖ్యమని ప్రకటించింది. 

Also Read: భారత్‌కు పుతిన్.. మరో అయిదు S-400 స్క్వాడ్రన్ల కొనుగోలుకు సిద్ధం

భారత్‌లో కూడా ఇండిగో కంపెనీ వద్ద ఎక్కువగా ఏ320 మోడల్స్‌ విమానాలే ఉన్నాయి. విస్తారా, ఎయిరిండియా లాంటి ఎయిర్‌లైన్స్‌ కూడా ఈ మోడల్‌ విమానాలు వాడుతున్నాయి. అయితే ఇప్పటిదాకా 300లకు పైగా విమానాలకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పూర్తయ్యిందని DGCA వెల్లడించింది. ఆదివారం ఉదయం నాటికి అన్ని విమానాలకు అప్‌గ్రేడ్ పూర్తవుతుందని తెలిపింది. కానీ అన్ని ఏ320 విమానాలకు ఈ సాప్ట్‌వేర్ అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం లేదని ఎయిర్‌బస్‌ చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త ELAC మోడల్ విమానాల్లో కూడా ఈ సమస్య ఏమీ ఉండదని పేర్కొన్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు