అమెరికా, హౌతీల మధ్య వార్ ముదురుతున్నది. ఎర్ర సముద్రంలో వాణిజ్యానికి అడ్డుగా వస్తున్న హౌతీలను అంతం చేయాలని అమెరికా చూస్తోంది. అయితే అమెరికన్ వార్ షిప్‌పై హౌతీలు దాడి చేసినట్లు సోమవారం ప్రకటించారు. USS హ్యారీ ట్రూమన్ నౌకతో పాటు US యుద్ధ నౌకలపై 18 మిస్సైల్స్‌తో పాటు డ్రోన్ దాడులు చేశామని హౌతీలు తెలిపారు. గత రెండు రోజుల క్రితం అమెరికా యెమన్ దేశంలో చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్న హౌతీలు వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికా నౌకలపై రాత్రంతా దాడులు జరిగాయని హౌతీలు వెల్లడించారు.
గడిచిన 24 గంటల్లో అమెరికా నావికాదళంపై హౌతీలు చేసిన ఈ దాడి రెండొవది అట. ఎర్రసముద్రంలో అమెరికన్ నౌకలు ప్రవేశించకుండా నిషేధం విధిస్తామంటూ బెదిరింపులకు దిగారు. రెండు రోజుల క్రితం యెమెన్‌పై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎయిర్ స్ట్రైక్స్‌లో యెమెన్ దేశస్తులు 50 మందికిపైగా మృతి చెందారు.
Also read: International Space Station : అక్కడ 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం