Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!

అమెరికా ఇచ్చే అంతర్జాతీయ సాయం నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తీసుకున్ననిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోఐరాస ఎయిడ్స్ విభాగం సంచలన లెక్కలు ప్రకటించింది.నాలుగేళ్లలో 63 లక్షల హెచ్‌ఐవీ మరణాలు నమోదవుతాయనిపేర్కొంది.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటు అందర్ని షాక్‌ కి గురి చేస్తున్నారు. అమెరికాను మళ్లీ ప్రపంచంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్న ట్రంప్.. ఆ దిశగా అన్ని చర్యలు మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ సాయాన్ని అందించడం అమెరికా నిలిపివేస్తుందని పేర్కొనడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

Also Read: BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!

తాజాగా ట్రంప్ నిర్ణయంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి.. హెచ్ఐవీ మరణాలు భారీగా పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేసింది. 4 ఏళ్లలో 63 లక్షల హెచ్ఐవీ మరణాలు సంభవించవచ్చని పేర్కొంది. కొత్తగా 87 లక్షల మంది ఎయిడ్స్ సోకే ప్రమాదం ఉందని అంచనా వేసింది.అంతర్జాతీయ సాయం నిలిపివేస్తూ ట్రంప్‌ చేసిన ప్రకటనపై ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్‌ విభాగం స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది. ఎయిడ్స్‌ కార్యక్రమానికి అమెరికా సాయం ఆపేస్తే.. 2029 నాటికి హెచ్‌ఐవీ కేసుల సంఖ్య 6 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. 

Also Read: Weddings: తగ్గుతున్న పెళ్లిళ్లు.. పెరుగుతున్న విడాకులు

కొత్త వేరియంట్లు..

లక్షల మంది ప్రాణాలు పోవడమే కాకుండా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని వివరించింది. గత కొన్నేళ్లుగా హెచ్‌ఐవీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొన్న ఐరాస ఎయిడ్స్ విభాగం.. 2023లో కొత్తగా 13 లక్షల కేసులు మాత్రమే నమోదైనట్లు వెల్లడించింది. 1995లో నమోదైన గరిష్ఠ కేసుల సంఖ్యతో పోలిస్తే 60 శాతం తగ్గినట్లు యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బయాన్‌యిమా వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్‌ నిర్ణయంతో హెచ్ఐవీ విషయంలో ఇప్పటివరకు పడిన కష్టం మొత్తం బూడిద  పాలు అయ్యే అవకాశాలున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

2029 నాటికి కొత్తగా 87 లక్షల మంది హెచ్‌ఐవీ బారిన పడవచ్చని.. 63 లక్షల ఎయిడ్స్‌ మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. 34 లక్షల మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారే ప్రమాదం ఉందని విన్నీ బయాన్‌యిమా పేర్కొన్నారు.ఇక పేదరిక నిర్మూలన, వ్యాధుల నివారణ, మానవతా సాయం లక్ష్యంతో యూఎస్‌ఎయిడ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ప్రభుత్వంలోని అతిపెద్ద మానవత, అభివృద్ధి పనుల విభాగంలో 13 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 

ప్రపంచంలోని 160కి పైగా దేశాల్లో ప్రతీ సంవత్సరం రూ.3.83 లక్షల కోట్లను అమెరికా ఈ సాయం కింద ఖర్చు చేస్తోంది. అయితే ఈ ఫెడరల్‌ గ్రాంట్లు, రుణాలను జనవరి 28వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అందిస్తున్న గ్రాంట్లను సమీక్షిస్తున్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌ వెల్లడించింది.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశాలకు, పలు స్వచ్ఛంద సంస్థలకు అమెరికా చేసే ఆర్థిక సాయం ఆగిపోనుంది. దీంతోపాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణ, విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కార్యక్రమాలపైనా ప్రభావం పడుతుంది. 

Also Read:jeera soda: ముగ్గురి ప్రాణం తీసిన జీరా సోడా.. మందుబాబులారా జాగ్రత్త!

Also Read: Air show: మతిపోగొడుతున్న ఏయిర్‌ షో.. అత్యాధునిక యుద్ధ విమానాల ప్రదర్శన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు