/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/US-Visa-jpg.webp)
హెచ్ 1 బీ వీసాల వల్ల మిగతా దేశాల కన్నా అమెరికాకే ఎక్కువ లాభం అంటోంది నాస్కామ్. ఐటీ సెక్టార్ లో అక్కడ లేని నైపుణ్యం మన వాళ్ళ దగ్గర ఉంది. అది పూడ్చడానికే కంపెనీలు ఇండియా నుంచి ప్రొఫెషనల్స్ ను తీసుకుని వెళతారు. అమెరికా అభివృద్ధికి పాంకేతిక అవసరమని...అది ఇండియన్స్ నుంచి బాగా వస్తుందని నాస్కామ్ అంటోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా చర్యలు, ఆదేశాల వల్ల అమెరికాకు వెళ్లే భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుందన్న ఆందోళన అవసరం లేదని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అయితే హెచ్ 1బీ వీసా హోల్డర్ల పిల్లల పౌరసత్వం విషయంలో మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నాని అన్నారు.
ఏం ఢోకా లేదు..
అమెరికాలో భారీ ఏఐ ప్రాజెక్టు స్టార్‌గేట్‌కు ట్రంప్ 2.0 ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కృత్రిమ మేధను మరింత విస్తృతం చేయడానికి, లక్ష ఉద్యోగాలను సృష్టించడానికి..ఇది ఉపయోగపడనుంది. అదీ కాక అమెరికా ప్రజల నైపుణ్యాలను మెరుగుపర్చడానికి మన కంపెనీలు 11 బిలయన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో అదనంగా 2,55,000 మంది ఉద్యోగులకు నైపుణ్యం వచ్చింది. ఈ పెట్టుబడులు 130కి పైగా యూనివర్సిటీలు, 29 కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులకు అనుకూలంగా మారింది. దాన్ని బట్టి వారందరూ అమెరికాలోనే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వొచ్చు. మరోవైపు హెచ్ 1 బీ వీసాల్లో 70 శాతం ఇండయన్లకే రావడంతోనే తెలుస్తోంది మనవాళ్ళకు అక్కడ ఎంత డిమాండ్ ఉందో అంటోంది నాస్కామ్. వీసాల్లో ఎన్ని రూల్స్ మార్చినా అమెరికా అభివృద్ధిని కాదనలేరు కాబట్టి ఏం జరిగినా మనవాళ్లు వీసాలు రావడం తథ్యం అని చెబుతోంది.