/rtv/media/media_files/2025/03/31/DDZFmPVoX6KxiRwMybOn.jpg)
Google introduces “time travel” feature
'టైమ్ ట్రావెల్'.. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. టైమ్ ట్రావెల్ చేయొచ్చని కొందరు అంటుంటే మరికొందరు అది సాధ్యం కాదని చెబుతుంటారు. చాలామంది శాస్త్రవేత్తలు టైమ్ ట్రావెల్ గురించి పరిశోధలను చేశారు. తమ అభిప్రాయలను వెల్లడించారు. టైమ్ ట్రావెల్‌పై అనేక సినిమాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా గూగుల్ మరో అద్భుతం సృష్టించింది. గూగుల్ మ్యాప్స్‌లో టైమ్ ట్రావెల్ ఫీచర్‌ను కొత్తగా తీసుకొచ్చింది.
Also Read: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్
ఈ ఫీచర్ ద్వారా గతంలో నగరాలు, ట్రాఫిక్, రవాణా సౌకర్యాలు, వీధులు, కొండలు, నదులు, చెరువులు అనేవి ఎలా ఉండేవో పాత చిత్రాల ద్వారా చూడవచ్చు. ఈ టైమ్ ట్రావెల్ ఫీచర్ కావాలంటే ముందుగా గూగల్ మ్యాప్స్ లేదా గూగుల్ఎర్త్ యాప్‌లోకి వెళ్లి మనకు కావాల్సిన ప్రదేశంపై సెర్చ్ చేయాలి. ఆ తర్వాత లేయర్స్ ఆప్షన్‌లోకి వెళ్లారు. అక్కడ టైమ్ లేప్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
Also Read: ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్
అప్పుడు మీరు కోరుకున్న సంవత్సరానికి, ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో వచ్చిన మార్పులు, తేడాలను చూడొచ్చు. ఐదారు దశాబ్దాల క్రితం అప్పటి హైదరాబాద్ లేదా ఢిల్లీని చూడాలనుకుంటే పాత చిత్రాల కోసం వెతుక్కోవాల్సి అవసరం లేదు. ఇందులోనే వాటిని చూడొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ప్రముఖ నగరాలైన లండన్, ప్యారిస్, బెర్లిన్‌లను కూడా 1930 నాటి చిత్రాలను చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి మొత్తం 28 వేల కోట్ల చిత్రాలను ఇందులో చూసి వర్చువల్ ప్రయాణ అనుభూతిని పొందేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గూగుల్ నిర్వాహకులు చెప్పారు.
telugu-news | rtv-news | google | google-maps