/rtv/media/media_files/2025/01/15/YSw6FIabJds5nRspwh45.jpg)
World Economic Forum
ప్రస్తుతం ఓవైపు ఉక్రెయిన్- రష్యా..మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే భారత్-చైనా, ఉత్తర కొరియా-దక్షిణ కొరియా తదితర దేశాల్లో భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2025లో దేశాల మధ్య సాయుధ ఘర్షణలు ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారబోతున్నాయని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) అంచనా వేసింది.
స్విట్జర్లాండ్‌లో దావోస్‌లో నిర్వహించిన సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక వేదిక.. అంతర్జాతీయ నష్ట ప్రమాద రిపోర్టును విడుదల చేసింది. మొత్తం 900 మంది నిపుణులు, విధానకర్తలు, పరిశ్రమల అధిపతులను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసింది. అలాగే వాతావరణ సంక్షోభాలను కూడా తక్షణ, స్వల్ప, దీర్ఘకాలకి ముప్పుగా పరిగణించింది.
Also Read: కుంభమేళలో ఈ బ్యూటీ సాధ్వి కాదు.. ఎవరీ హర్ష రిచారియా..?
మొత్తానికి ఐదు అంశాలను WEF తీవ్ర ముప్పుగా పేర్కొంది.
1.దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరగడం
2. విపత్కర వాతావరణ పరిస్థితులు తలెత్తడం
3. భౌగోళిక-వాణిజ్య పరంగా వివాదాలు రావడం
4. తప్పుడు సమాచార వ్యాప్తి
5. సామాజిక విభజన
వచ్చే రెండేళ్లలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని WEF అతిపెద్ద ముప్పుగా పరిగణించింది. అలాగే ప్రకృతి విపత్తులు, దేశాల మధ్య సాయుధ ఘర్షణలు, సామాజిక విభజనలు, సైబర్ గూఢచర్యలను స్వల్పకాలిక ముప్పుగా వర్గీకరించింది. అలాగే వచ్చే పదేళ్లలో వాతావరణ వైపరీత్యాలను తీవ్ర ముప్పుగా తేల్చింది. జీవవైవిధ్య నష్టం, పర్యావరణ వ్యవస్థ పతనం కావడం, భూవి ఆవరణ వ్యవస్థల్లో మార్పులు రావడం, ప్రకృతి వనరుల కొరత ఏర్పడటం, తప్పుడు సమాచార వ్యాప్తిని దీర్ఘకాలిక ముప్పుగా పరిగణించింది.
Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు