Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం

దావోస్...అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ముఖ్యమైన ఆర్ధిక సదస్సు. దీనికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతారు. అయితే వీళ్ళు అక్కడకు కేవలం మీటింగ్ కోసమే వెళ్ళడం లేదు...విచ్చలవిడి శృంగారం కోసం వెళుతున్నారని చెబుతోంది డెయిలీ మెయిల్.

New Update
meeting

Davos At Switzerland

స్విట్జర్లాండ్ తో జరిగే దావోస్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మీటింగ్ కు దాదాపు 130 దేశాల నుంచి ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు వస్తారు. భవిష్యత్తు అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి జరిగే వివిధ రంగాలపై చర్చలు జరుపుతారు. అయితే ఇదంతా ఒకవైపే. నాణానికి మరోవైపు కూడా ఉందని చెబుతోంది ప్రముఖ పత్రిక డెయిలీ మెయిల్.  ఇక్కడకు వచ్చిన పారిశ్రామిక వేత్తలపై సంచలన నివేదిక బయటపెట్టింది ఈ యూకే బేస్డ్ పేపర్. సదస్సుకు హాజరైన పారిశ్రామిక వేత్తలు శృంగారం కోసం పరితపించిపోయి కోట్లు ఖర్చు చేశారని చెప్పింది.


విచ్చలవిడిగా రెచ్చిపోయారు...

దావోస్ లో ఎస్కార్ట్ ఏజెన్సీలకు బాగా డిమాండ్ పెరిగింది ఈసారి. వీరిద్వారా  శృంగారానికి పారిశ్రామిక వేత్తలు బాగా డబ్బులు ఖర్చు చేశారని తెలుస్తోంది.  స్విట్జర్లాండ్ లో వేశ్యావృత్తి లీగల్. వీటి కోసం అక్కడ స్పెషల్ ఏజెన్సీలు ఉంటాయి. ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చును.  వీటికి కంపెనీలు ఉంటాయి. ఎలాంటి వారు కావాలన్నీ వీటి ద్వారా బుక్ చేసుకోవచ్చును. ఇలాంటి చోట్ల నుంచి దావోస్ కు వచ్చిన పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున బుకింగ్ లు చేసుకున్నారు. వారికి చాలానే డబ్బులు కూడా ముట్టజెప్పారని డెయిలీ మెయిల్ చెబుతోంది. ఒక్కో బుకింగ్ కూ 6000 పౌండ్లు కూడా చెల్లించినవారు ఉన్నారుట. ఇలా మొత్తం ఈ ఏడాది జరిగిన దావోస్ లో మొదటి మూడు రోజుల్లోనే ఒక్క వెబ్ సైట్ నుంచే 2, 70, 000 పౌండ్లు అంటూ మన కరెన్సీలో 2.9 కోట్లు బుక్ చేసుకున్నారని చెప్పింది. ఇలా మొత్తం బుకింగ్ ల ఖర్చు 10 కోట్ల పైనే ఉంటుందని డెయిలీ మెయిల్ తన నివేదికలో తెలిపింది.

ఇక స్విట్జర్లాంగ్ లో ఆర్గీస్ అనే పార్టీలు జరుగుతుంటాయి. ఇందులో ఒకేసారి ఎక్కువ మంది అమ్మాయిలను బుక్ చేసుకోవచ్చును. ఇలాంటి ఆర్గీస్ పార్టీలను ఎరేంజ్ చేసే టిట్ ఫర్ ట్యాట్ అనే కంపెనీ యాప్ నుంచి దావోస్ కు వచ్చిన 90 మంది పారిశ్రామిక వేత్తలు మూడు రోజుల్లో 300 ఎస్కార్ట్ లను బుక్ చేసుకున్నారని చెప్పింది. ఇందులో ట్రాన్స్ జెండర్లు కూడా ఉన్నారని తెలిపింది. గతేడాది ఈ సంఖ్య 170 మందిని మాత్రమే బుక్ చేసుకుంటే ఈ సారి ఆ సంఖ్య 300కు పెరిగిందని చెప్పింది.  

Also Read: Cricket: మూడో టీ20 కూడా మనదేనా...సీరీస్ కొట్టేస్తారా..


  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు