Parliament: పార్లమెంట్ రద్దు.. మరో రెండు నెలల్లో ఎన్నికలు!

జర్మనీ పార్లమెంట్ రద్దు అయింది. అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2025 ఫిబ్రవరి 23న జర్మనీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్వహణ తాత్కాలిక బాధ్యతలు ఛాన్సలర్‌ ఒలాఫ్ షోల్జ్‌కు  అప్పగించారు.

author-image
By srinivas
New Update
german

german Photograph: (german)

Parliament: జర్మనీ పార్లమెంట్ రద్దు అయింది. అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2025 ఫిబ్రవరి 23న జర్మనీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్వహణ తాత్కాలిక బాధ్యతలు ఛాన్సలర్‌ ఒలాఫ్ షోల్జ్‌కు  అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించిన ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌.. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 

 సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో..


శుక్రవారం జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్ పార్లమెంటును రద్దు చేయగా.. ఫిబ్రవరి 23ని ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబరులో పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన విషయం తెలిసిందే. స్కోల్జ్ విశ్వాస ఓటులో ఓడిపోయాడు. నవంబర్ 6న మూడు-పార్టీల సంకీర్ణ పతనం తర్వాత మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే వివాదంలో స్కోల్జ్ తన ఆర్థిక మంత్రిని తొలగించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Tiger: వరంగల్‌లో పులి సంచారం.. పంట పొలాల్లోనే తిష్ట!

 నిజానికి అనుకున్నదానికంటే ఏడు నెలల ముందుగా అంటే ఫిబ్రవరి 23న పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని అనేక ప్రధాన పార్టీల నాయకులు అంగీకరించారు. ఇక 733 మంది సభ్యులున్న సభలో ఇటీవల ఓటింగ్‌ జరిగింది. స్కోల్జ్ కు అనుకూలంగా కేవలం 207, వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు.116 మంది ఓటింగ్ లో పాల్గొనలేదు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు 
ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిక్‌, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్‌ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్‌ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.   

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

 telugu-news | rtv-news | sheik-hasina | international

 

Advertisment
Advertisment
Advertisment